శరీరంలో యూరిక్ యాసిడ్ ఎప్పుడూ నియంత్రణలో ఉండాలి. లేకపోతే వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే యూరిక్ యాసిడ్ సమస్యను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. ఈ సమస్య ఉన్నప్పుడు కిచెన్‌లో లభించే పదార్ధంతో చాలా సులభంగా నయం చేయవచ్చు.
యూరిక్ యాసిడ్ సమస్యలు పసుపు అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే పోషక పదార్ధాలు శరీరంలో పెరుగుతున్న యూరిక్ యాసిడ్‌ను తగ్గిస్తాయి. పసుపు అనేది ప్రతి భారతీయుడి కిచెన్‌లో తప్పకుండా లభించే పదార్ధం. వాస్తవానికి ఇదొక ఆయుర్వేద మూలిక. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బయోటిక్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. దాంతోపాటు పసుపులో ఉండే కర్క్యూమిన్ అనే పోషకం యూరిక్ యాసిడ్ తగ్గించడంలో దోహదపడుతుంది. పాలలో పసుపుతో పాటు చిటికెడు మిరియాల పౌడర్ కలుపుకుని తాగితే మంచి ఫలితాలుంటాయి.
రోజూ నిర్ణీత మోతాదులో నీళ్లు తాగుతుంటే..కచ్తితంగా మీ శరీరంలోని విషపదార్ధాలు, యూరిక్ యాసిడ్ బయటకు తొలగిపోతాయి. అదే సమయంలో స్వీట్స్, యాడెడ్ షుగర్ పదార్ధాలకు దూరంగా ఉండాలి. లేకపోతే డయాబెటిస్ ముప్పు వెంటాడుతుంది. గ్రీన్ టీ తాగడం వల్ల శరీరంలోని యూరిక్ యాసిడ్ తగ్గుతుంది. ఉదయం, సాయంత్రం ఒక్కొక్క కప్ గ్రీన్ టీ తాగడం చాలా మంచిది. యూరిక్ యాసిడ్ తగ్గించేందుకు గ్రీన్ వెజిటెబుల్స్, బీన్స్, పప్పులు, పింటో బీన్స్ , సన్‌ఫ్లవర్ విత్తనాలు మీ డైట్లో భాగంగా చేసుకోవాలి.
మరోవైపు ఫైబర్ ఎక్కువగా ఉండే ఓట్స్, యాపిల్, జామ తినడం వల్ల యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉంటుంది. యూరిక్ యాసిడ్ తగ్గించేందుకు విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆరెంజ్, నిమ్మ, బెర్రీస్ తప్పకుండా తీసుకోవాలి.
Also read: Stomache problems: మీ కిచెన్‌లో ఉండే ఆ పదార్ధంతో కడుపు సంబంధిత సమస్యలకు అద్భుతమైన పరిష్కారం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook