Uric Acid Tips: యూరిక్ యాసిడ్ సమస్యగా మారిందా, ఈ 4 పాటిస్తే చాలు

Uric Acid Tips: శరీరంలో అంతర్గతంగా ఏ మార్పు జరగకుండా అనారోగ్యం అనేది ఉండదు. అంతర్గతంగా చోటుచేసుకునే మార్పులతో వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. అందులో అతి ప్రమాదకరమైంది యూరిక్ యాసిడ్. ఇది పెరగడం వల్ల సాధారణ జీవనశైలిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 31, 2024, 08:23 PM IST
Uric Acid Tips: యూరిక్ యాసిడ్ సమస్యగా మారిందా, ఈ 4 పాటిస్తే చాలు

Uric Acid Tips: ఇటీవలి కాలంలో యూరిక్ యాసిడ్ సమస్య చాలా ఎక్కువగా కన్పిస్తోంది. కాళ్లలో వాపు, పట్టేసినట్టుండటం జరుగుతుంటుంది. ఒక్కోసారి నడవడానికి సైతం ఇబ్బంది ఏర్పడుతుంది. ఆధునిక బిజీ లైఫ్‌లో చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగానే శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతున్న పరిస్థితి. అందుకే యూరిక్ యాసిడ్ సమస్య తగ్గించాలంటే ప్రధానంగా ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పు రావాలి. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం లేదా వాకింగ్ చేయండం, హెల్తీ ఫుడ్ తినడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా యూరిక్ యాసిడ్ సమస్యను తగ్గించవచ్చు.

జైతూన్ ఆయిల్ అనేది అద్భుతమైన ఫలితాలనిస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. జైతూన్ ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్ వాడటం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ సహజసిద్దంగా తగ్గుతుంది. ఇక మరో ముఖ్యమైన చిట్కా తగినంత నిద్ర. ప్రతి మనిషికి రాత్రి వేళ 7-8 గంటలు నిద్ర తప్పకుండా ఉండాలి. నిద్రలేమి అనేది చాలా రకాల సమస్యలకు కారణమౌతుంది. నిద్ర తక్కువైనా యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతుంటాయి. 

రోజూ తగినంత నీళ్లు తప్పకుండా తాగాలి. శరీరం ఎప్పుడూ డీ హైడ్రేట్ కాకూడదు. దీనివల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతాయి. నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలోని విష, వ్యర్ధ పదార్ధాలను కిడ్నీలు సక్రమంగా బయటకు పంపించగలుగుతాయి. దాంతో యూరిక్ యాసిడ్ సమస్య ఉత్పన్నం కాదు. రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీళ్లు తప్పకుండా తాగాలి. మరో ప్రదానమైన చిట్కా వాము నీరు తాగడం. వాము నీరు ఆరోగ్యపరంగా చాలా మంచిది. దీనివల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గుతాయి. కడుపు సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయి. 

Also read: Smoking Threats: ఈ వీడియో చూస్తే ఇక జీవితంలో స్మోక్ చేయరు, ఇంతలా ఉంటుందా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News