Vitamin B12 deficiency Symptoms: విటమిన్ B12 లోపం వల్ల వచ్చే వ్యాధులు, ఈ సమస్య వస్తే ఏం చేయాలో తెలుసా?

Vitamin B12 deficiency Symptoms: విటమిన్ B12 సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 10, 2023, 12:56 PM IST
Vitamin B12 deficiency Symptoms: విటమిన్ B12 లోపం వల్ల వచ్చే వ్యాధులు, ఈ సమస్య వస్తే ఏం చేయాలో తెలుసా?

Vitamin B12 deficiency Symptoms: విటమిన్ B12 శరీరానికి అవసరమైన ముఖ్యమైన విటమిన్. ఇది శరీరంలో శక్తి ఉత్పత్తి చేయడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా నరాల పనితీరు, రక్తం సరఫను పెంచడానికి సహాయపడుతుంది. అయితే చాలా మంది ప్రస్తుతం విటమిన్‌ B12 సమస్యలతో బాధపడుతున్నారు. ఈ లోపంతో బాధపడేవారు తప్పకుండా  మాంసం, చేపలు, పాలు, పాల ఉత్పత్తులు, గుడ్లు ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. శరీరంలో విటమిన్ B12 లోపం ఉంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఎలాంటి అనారోగ్య సమస్యల వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

అలసట, తలనొప్పి, మానసిక సమస్యలు:
శరీరంలో విటమిన్ B12 వల్ల ఎర్ర రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది. దీని వల్ల రక్తంలో మార్పులు సంభవించే అవకాశాలున్నాయి. మీ శరీరంలో విటమిన్ B12 తగినంత స్థాయిలో లేకపోతే ఎర్ర రక్త కణాల సాధారణ ఉత్పత్తి తగ్గిపోతుంది. అంతేకాకుండా మెగాలోబ్లాస్టిక్ అనీమియాకు దారితీస్తుంది. కొంత మందిలో అలసట, తలనొప్పి, మానసిక కల్లోలం వంటి సమస్యలు కూడా రావొచ్చు.

జీర్ణ వ్యవస్థపై ప్రభావం:
విటమిన్ B-12 లోపం వంటి సమస్యలు ఉంటే జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. పోషకాలు లేకపోవడం వల్ల జీర్ణాశయంకు తగినంత ఆక్సిజన్ అందక.. ఇది అతిసారం, వికారం, మలబద్ధకం, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలకు దారి తీసే అవకాశాలున్నాయి.

న్యూరోలాజికల్:
ఈ విటమిన్ B12 లోపం ఉంటే నరాల సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. దీని కారణంగా చాలా మందిలో మానసిక బలహీనత, మానసిక విచారం, జ్ఞాపకశక్తి లోపం వంటి సమస్యలు రావొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

కండరాల బలహీనత:
కండరాల బలహీనత సమస్యలతో బాధపడుతుంటే..శరీరంలో విటమిన్ B12 లోపం ఉన్నట్లేని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ లోపంతో బాధపడేవారు తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also read: Krithi Shetty Photos: అందాల ఆరబోతలో హద్దులు దాటేస్తున్న కృతి శెట్టి..బాడీకాన్ డ్రెస్సులో థైస్ షో!

Also read: Krithi Shetty Photos: అందాల ఆరబోతలో హద్దులు దాటేస్తున్న కృతి శెట్టి..బాడీకాన్ డ్రెస్సులో థైస్ షో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News