Walnuts Powder For Winter Season Diseases: చలికాలంలో చాలామందిలోని చర్మ సమస్యలు జుట్టు రాలడం అలసట రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. అంతేకాకుండా చాలామందిలో కీళ్ల వాపులు కీళ్ల నొప్పులు నడుము నొప్పులు కూడా వస్తుంటాయి. ఈ సమస్యలన్నీ రావడానికి ప్రధాన కారణం శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గడమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరానికి రోగ నిరోధక శక్తి తప్పనిసరి.. కాబట్టి దీనిని పెంచుకోవడం శరీరానికి చాలా అవసరం. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా రోగనిరోధక శక్తి పై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. లేదంటే దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
శరీరంలో శక్తి తగ్గడం వల్ల కంటి చూపు మందగించడం ఆందోళన ఒత్తిడి రక్తహీనత కాల్షియం లోపం సమస్యలు కూడా వస్తాయి. అయితే ఈ సమస్యలు రాకుండా ఉండడానికి తప్పకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది. ఈ చిట్కాలను వినియోగిస్తే ఆ సమస్యల నుంచి శాశ్వతంగా పరిష్కారం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఆ చిట్కాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
అందరికీ సులభంగా ఇంట్లో లభించే వాటితోనే చలి వాన కాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షించుకోవచ్చు. అంతేకాకుండా వీటితో శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. దీనికోసం పోషకాలు కలిగిన ఒక పొడిని తయారు చేసుకొని ప్రతిరోజు పాలలో తాగాల్సి ఉంటుంది. అంతేకాకుండా దీనిని ఉదయం పూట పాలలో తాగితే రెట్టింపు ప్రయోజనాలు పొందుతారు. అయితే ఈ పొడిని ఎలా తయారు చేసుకోవాలో అన్ని వివరాలు మనం ఎప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు చేసుకునే పొడిలో ఎండుకొబ్బరి ప్రధానమైనది. ఈ పొడి తయారు చేసుకోవడానికి ముందుగా వాల్నట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వాల్నట్స్ ను తీసుకొని ఒక బౌల్లో వేసి.. అదే బౌల్లో ఎండుకొబ్బరి అవయస గింజలు పుచ్చకాయ గింజలు బాదం పప్పులు వేసి బాగా వేయించుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత అందులో పట్టిక బెల్లాన్ని వేసి ఓ జారులో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పొడిని ఓ గాజు సీసాలో నిలువ చేసుకొని ప్రతిరోజు ఉదయం పూట పాలలో వేసుకొని తాగితే రోగనిరోధక శక్తి పెరిగి అనారోగ్య సమస్యలు సులభంగా తగ్గుతాయి.
Also Read: Allu Aravind Supports Dil Raju: దిల్ రాజుకు అల్లు అరవింద్ సపోర్ట్.. అసలు అది జరగదంటూ కామెంట్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook