Weight Loss Tips: ఎలాంటి ఖర్చు లేకుండా కేవలం 10 రోజుల్లో బరువు తగ్గొచ్చు..

Weight Loss In 10 Days: శరీర బరువు పెరగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. కావున ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి అవసరం ఎంతగానో ఉంది. అయితే ప్రస్తుతం చాలా మంది బరువు పెరగడం వంటి సమస్యల బారిన పడుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 21, 2022, 04:48 PM IST
  • బరువు తగ్గాలనుకుంటున్నారా
  • రోజూ ఉదయం అల్లంతో చేసిన
  • టీ తాగితే కేవలం 10 రోజుల్లో బరువు తగ్గొచ్చు.
Weight Loss Tips: ఎలాంటి ఖర్చు లేకుండా కేవలం 10 రోజుల్లో బరువు తగ్గొచ్చు..

Weight Loss In 10 Days: శరీర బరువు పెరగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. కావున ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి అవసరం ఎంతగానో ఉంది. అయితే ప్రస్తుతం చాలా మంది బరువు పెరగడం వంటి సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి పలు నియమాలు పాటించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కొన్ని హోం రెమెడీస్‌ను వినియోగిస్తే బరువు సులభంగా తగ్గొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. దీని కోసం నిమ్మకాయ, అల్లం రసంతో చేసిన టీని తీసుకోవాలి. లేకపోతే నిమ్మరసంతో చేసిన పలు ఆహార పదార్థాలను తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు.

ఈ టీతో బరువు తగ్గొచ్చు:

<<బరువు తగ్గాలనుకుంటే కచ్చితంగా చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించాల్సి ఉంటుంది. కావున బరువు తగ్గడానికి కచ్చితంగా అల్లం, నిమ్మరసం ఉపయోగించవచ్చు. ఇందులో ఉండే మూలకాలు కొలెస్ట్రాల్ స్థాయిని కూడా నియంత్రిస్తుంది. దీంతో పాటు గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది.
 

<<అల్లం, నిమ్మకాయ రసం తీయాలి ఆ తర్వాత.. రెండు చెంచాల అల్లం రసం, రెండు చెంచాల నిమ్మరసం, ఒక చెంచా తేనె కలిపి.. ఒక గ్లాసు చల్లని నీటిలో తీసుకుని తాగవచ్చు. కావాలనుకుంటే.. గోరువెచ్చని నీటిని కూడా వినియోగించవచ్చు.  అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం సమస్యలు ఉంటే.. ఈ సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా కడుపు సమస్యలకు ఇది దివ్యౌషధం పని చేస్తుంది.
 

<<బెల్లీ ఫ్యాట్‌తో బాధపడుతున్నవారు ఈ డ్రింక్స్‌ను తప్పకుండా తీసుకోండి. ఈ టీ మీకు అన్ని అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also read:  Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్‌ పెట్టొచ్చు..

Also read: Weight Loss Diet: బరువు తగ్గాలనుకుంటున్నారా.. రోజూ డైట్‌లో ఈ సలాడ్స్‌ను తీసుకోండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News