Weight Loss Tips: పడుకునే ముందు ఈ తప్పులు చేస్తున్నారా..? అయితే స్థూలకాయం పక్కా వస్తుంది

Weight Loss Tips: ఆధునిక జీవన విధానంలో అదిక బరువు సమస్య ప్రతి ఒక్కరినీ బాధిస్తోంది. వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా స్థూలకాయం వెంటాడుతోంది. స్థూలకాయం వల్ల పలు వ్యాధులు చుట్టుముడుతున్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 21, 2023, 05:51 PM IST
Weight Loss Tips: పడుకునే ముందు ఈ తప్పులు చేస్తున్నారా..? అయితే స్థూలకాయం పక్కా వస్తుంది

Never Do These Mistakes while Sleeping: ఇటీవలి కాలంలో అధిక బరువు సమస్య ఎక్కువైపోయింది. ఫలితంగా కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, డయాబెటిస్, హార్ట్ ఎటాక్, కరోనరా ఆర్టరీ డిసీజెస్, ట్రిపుల్ వెసెల్ డిసీజ్ ముప్పు అధికమౌతోంది. అందుకే అధిక బరువు సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే కొన్ని పొరపాట్ల నుంచి దూరంగా ఉండాలి.

అధిక బరువు లేదా స్థూలకాయం అనేది సాధారణంగా చెడు ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణంగా తలెత్తే ప్రధానమైన సమస్య. ఈ ఒక్క సమస్య కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. అందుకే ఈ సమస్య నుంచి విముక్తి పొందాలంటే, స్థూలకాయానికి చెక్ పెట్టాలంటే కొన్ని నిబంధనలు లేదా సూచనలు తప్పకుండా పాటించాలి.

రాత్రి వేళ కొన్ని పొరపాట్లు చేయకుండా ఉండాలి. లేకపోతే స్థూలకాయం కారణంగా డయాబెటిస్, హార్ట్ ఎటాక్, కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు వంటి ప్రమాదకర వ్యాధులు తలెత్తుతాయి. అందుకే సాధ్యమైనంత త్వరగా బరువు తగ్గించే ప్రక్రియ ప్రారంభించాలి. బరువు తగ్గించేందుకు డైట్ కఠినంగా ఉండటమే కాకుుండా వర్కవుట్స్ లేదా వాకింగ్ నిరంతరం చేయాలి. స్థూలకాయానికి కారణమయ్యే ఏయే పొరపాట్లు చేయకూడదో తెలుసుకుందాం.

Also Read: Chia Seeds For Weight Loss: కాఫీలో చియా విత్తనాలు కలుపుకుని తాగితే వేగంగా బరువు తగ్గడం ఖాయం!

చాలా మంది విందులు వినోదాల సమయంలో లేదా పెళ్లిళ్లలో  లేదా పండుగలప్పుడు డిన్నర్ తరువాత కూల్ డ్రింక్స్ సేవిస్తుంటారు. కానీ రాత్రి వేళ నిద్రపోయే ముందు కూల్ డ్రింక్స్ తాగడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. దీనివల్ల కడుపు, నడుము చుట్టూ ఫ్యాట్ పెరిగిపోతుంది. అందుకే మీ డైట్ నుంచి కూల్ డ్రింక్స్ దూరం చేయాలి

మద్యం ఆరోగ్యానికి మంచిది కాదనే సంగతి అందరికీ తెలిసిందే. అయినా చాలామంది మద్యానికి అలవాటు పడిపోతుంటారు. కొంతమందైతే బానిసలవుతుంటారు. అర్ధరాత్రి వరకూ మందుపార్టీల్లో గడపడం ఎక్కువైపోయింది. శరీరం మెటబోలిజం తగ్గిపోకుండా చూసుకోవాలి. రాత్రి వేళ మందు అలవాటు ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే శరీరం మెటబోలిజం తగ్గితే బరువు పెరిగే ముప్పు కచ్చితంగా ఉంటుంది. 

ఇక మరో ముఖ్యమైన విషయం చాలామంది చేసే పొరపాటు రాత్రి వేళ అంటే డిన్నర్ గట్టిగా తినడం. డిన్నర్ ఎప్పుడూ తేలిగ్గా ఉండాలి. హెవీ డిన్నర్ అలవాటు మంచిది కాదు. రోజూ రాత్రి వేళ డిన్నర్ హెవీగా ఉంటే ఫ్యాట్ పేరుకుపోతుంది. చాలామంది పగలు ఎక్కువ తినే పరిస్థితి లేనప్పుడు రాత్రి వేళ లాగించేస్తుంటారు. ఇది మంచి అలవాటు కాదు. అధిక బరువుకు చెక్ పెట్టాలంటే, స్థూలకాయం సమస్య నుంచి విముక్తి పొందాలంటే రాత్రి వేళ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పొరపాట్లు చేయకూడదు. అదే సమయంలో లంచ్, డిన్నర్ తరువాత కచ్చితంగా 7-8 నిమిషాలు లైట్ వాకింగ్ చేయాలి. 

Also Read: Joint Pain Treatment: కీళ్ల నొప్పులు తగ్గడానికి ఏం చేయాలో తెలుసా?, ఈ నొప్పులు ఎలా వస్తాయంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News