Weight loss Tips: ఆధునిక జీవన విధానంలో సమయానికి తిండి తినకపోవడం, జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, నిద్ర సరిగ్గా లేకపోవడం ఇవన్నీ వివిధ రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంటాయి. ఇందులో ముఖ్యమైంది అధిక బరువు లేదా స్థూలకాయం. స్థూలకాయం సమస్య చాలా గంభీరమైనదే. అందుకే తగిన జాగ్రత్తలతో స్థూలకాయం తగ్గించుకునే మార్గాలు అణ్వేషించాలి.
చాలామందికి రాత్రి పూట ఏదో ఒకటి తింటూ ఉండే కోరిక, యావ ఉంటుంది. ఇది మంచి అలవాటు కానే కాదు. ఈ అలవాటు కారణంగా శరీరంలో అత్యంత కీలకమై జీవక్రియ లేదా మెటబోలిజం మందగిస్తుంది. ఎప్పుడైతే మెటబోలిజం మందగిస్తుందో శరీర బరువు క్రమంగా పెరుగుతుంది. మరి రాత్రిపూట తినే అలవాటు ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం..దీనికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఇవి పాటిస్తే తప్పకుండా ఈ అలవాటు తగ్గించుకోవచ్చు. చెడు ఆహారపు అలవాట్లు కూడా బరువు పెరగడానికి కారణాలు. ఓవర్ ఈటింగ్ అలవాటు కారణంగా అధిక రక్తపోటు, డయాబెటిస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యంగా ఉండాలంటే ఓవర్ ఈటింగ్ అలవాటుకు చెక్ చెప్పాల్సిందే.
నెవర్ స్కిప్ బ్రేక్‌ఫాస్ట్
చాలామంది డైటింగ్ పేరుతో ఉదయం వేళ బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తుంటారు. కానీ ఈ అలవాటు ఏమాత్రం మంచిది కాదు. రాత్రి భోజనం మానేసినా ఫరవాలేదు గానీ ఉదయం వేళ బ్రేక్‌ఫాస్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ మానకూడదు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటేనే శరీరం జీవక్రియ సరిగ్గా ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్ మానేయడం వల్ల జీవక్రియ మందగించి వివిధ రకాల సమస్యుల చుట్టుముడుతాయి. ఉదయం వేళ బ్రేక్‌ఫాస్త్ తీసుకోకుంటే అలసటగా ఉంటుంది రాత్రి వేళ అవసరాన్ని మించి తింటుంటారు.
నమిలి తినడం
ఎప్పుడైనా సరే భోజనం నమిలి తినడం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా రాత్రి వేళ తినే ఆహారాన్ని సమయం తీసుకుని నమిలి తినడం మంచిది. ఏదో కంగారుగా ముద్దలు మింగేస్తూ తినడం మంచి అలవాటు కానే కాదు. ఎప్పుడైతే నమిలి తినడం అలవాటు చేసుకున్నామో ఇక రాత్రి వేళ ఓవర్ ఈటింగ్ అనేది ఉండదు.
తగిన నిద్ర
మీకు స్థూలకాయం ఉన్నా లేకున్నా...మనిషికి రాత్రి నిద్ర చాలా అవసరం. రోజుకు రాత్రి వేళ కనీసం 7-8 గంటల నిద్ర ఉండాల్సిందే. రాత్రి వేళ త్వరగా నిద్రపోతే ఓవర్ ఈటింగ్ సమస్యే రాదు. రాత్రి పూట ఎక్కువ నీళ్లు తాగాలి. కొద్ది కొద్దిగా నీళ్లు తాగుతుంటే కడుపు నిండినట్టుండి ఆకలేయదు. రాత్రి వేళ తగినంతగా నిద్ర పోతే ఆరోగ్యానికి మంచిదే కాకుండా అధిక బరువు సమస్య కూడా తగ్గిస్తుంది.
Also read: Hair Care Tips: రోజూ ఈ నట్స్ సేవిస్తే చాలు..అందమైన, పొడవైన కేశాలు మీ సొంతం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook