హార్ట్ అట్టాక్ Vs కార్డియాక్ అరెస్ట్.. రెండింటికి తేడాలేంటి..? వీటి లక్షణాలు ఏంటి..?

చాలా సార్లు శరీరంలో కొన్ని భయంకర ఆరోగ్య సమస్యల వలన మనమే కాకుండా మన పూర్తి కుటుంబం ఇబ్బంది పడుతుంది. వాటిల్లో హార్ట్ అటాక్ మరియు కార్డియాక్ అరెస్ట్.. రెండు ఒకటి కాదండోయ్.. అవేంటో మీరే చూడండి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 9, 2023, 07:21 PM IST
హార్ట్ అట్టాక్ Vs కార్డియాక్ అరెస్ట్.. రెండింటికి తేడాలేంటి..? వీటి లక్షణాలు ఏంటి..?

Heart Attack & Cardiac Arrest: గుండె సమస్యలకు దూరంగా ఉండాలంటే.. పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి. ఆరోగ్య రక్షణకి పోషకాహారం తప్పనిసరి. గుండె కొట్టుకోవటం అకస్మాత్తుగా ఆగిపోవడాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. ఇది ఏ సూచనలు,సంకేతాలు లేకుండా వస్తుంది. ఇది ఒక  కంప్యూటర్ సిస్టమ్ లాంటిది. కంప్యూటర్ ఎలా అయితే ఒక వైర్ తో ఇంకో వైర్ కనెక్ట్ అయ్యి పని చేస్తాయో.. మన శరీరంలో గుండె కూడా అదే విధంగా పని చేస్తుంది. గుండెలో ఏదైనా లోపం ఏర్పడితే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుంది.కార్డియాక్ అరెస్ట్ రావడానికి గల కారణం గురించి ఇపుడు  తెలుసుకుందాం. 

కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి? 
చాలా మంది గుండె ఆగిపోవడాన్ని గుండెపోటు అనుకుంటారు.. కానీ కాదు. గుండెల్లో ఉండే అంతర్గత భాగాల్లో లోపం దెబ్బతిన్నప్పుడు కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుంది.రక్తాన్ని శుద్ధి చేసి.. శరీరం అంతా వ్యాపింపచేయడం గుండె యొక్క పని. ఇందులో ఏదైనా సమస్య కలిగితే నేరుగా దాని ప్రభావం గుండెపై పడుతుంది.గుండెపోటు సమస్య కలిగిన వారికి ఈ కార్డియాక్ అరెస్ట్ తొందరగా సంభవించే ప్రమాదం అధికం. 

కార్డియాక్ అరెస్ట్ యొక్క లక్షణాలు 
1) గుండె వేగంగా కొట్టుకోవడం  
2) ఛాతీలో నొప్పి  
3) మైకము 
4) శ్వాస సమస్యలు 
5) తొందరగా అలసిపోవడం  

Also Read: Vande Bharat Express Trains:కొత్తగా మరో 9 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ఏయే రూట్లలో

హార్ట్ అటాక్ అంటే ఏంటి.. ? 
ప్రస్తుత కాలంలోని అనారోగ్యకరమైన జీవనశైలి మరియు చెడు ఆహారపు అలవాట్ల వల్ల గుండెపోటు వస్తుంది. గుండెపోటు కారణంగా సంభవించే మరణాల సంఖ్య క్రమ క్రమంగా వేగంగా పెరుగుతూనే ఉంది. దీని వల్ల చాలా మంది ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకుంటున్నారు. 

అదే కార్డియాక్ అరెస్ట్ విషయానికి వస్తే.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.గుండెలో కొన్ని భాగాల్లో రక్త ప్రసరణ తక్కువగా ఉన్నప్పుడు గుండెపోటు కలుగుతుంది.కానీ, కార్డియాక్ అరెస్ట్ లో రక్త ప్రసరణ ఆగిపోతుంది.గుండెపోటు కలిగిన తర్వాత కూడా శరీరంలో కొన్ని భాగాల్లో రక్త ప్రసరణ జరుగుతుంది.కానీ,కార్డియాక్ అరెస్ట్ లో రక్త ప్రసరణ శరీరమంతటా ఆగిపోతుంది. దీనినే కార్డియాక్ అరెస్ట్ అంటారు. 

Also Read: Orange Benefits: అధిక బరువుకు చెక్ చెప్పాలంటే ఈ ఫ్రూట్ రోజూ తాగితే చాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News