Vande Bharat Express Trains: కొత్తగా మరో 9 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. ఏయే రూట్లలో వస్తున్నాయంటే..

Vande Bharat Express Trains New Routes: G20 సదస్సు కోసం భారత్ కి వచ్చిన జి20 దేశాలకు చెందిన మీడియా ప్రతినిధుల బృందం గాంధీనగర్ - ముంబై మార్గంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించింది. " వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణం తమని ఎంతో ఆకట్టుకుంది " అని సదరు మీడియా ప్రతినిధుల బృందం హర్షం వ్యక్తంచేసింది. 

Written by - Pavan | Last Updated : Sep 9, 2023, 07:00 PM IST
Vande Bharat Express Trains: కొత్తగా మరో 9 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. ఏయే రూట్లలో వస్తున్నాయంటే..

Vande Bharat Express Trains New Routes: ఢిల్లీ: ఇండియాలో అత్యంత స్పీడ్ ట్రైన్స్‌లో ఒకటిగా పేరున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రస్తుతం దేశం నలుమూలలా 25 మార్గాల్లో విజయవంతంగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ సెమీ-హై స్పీడ్ రైళ్లలో ప్రతి ఒక్కటి ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రారంభించడం మరో విశేషం. తాజాగా ఇండియన్ రైల్వేస్ త్వరలోనే 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ఈ 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల కోసం చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ స్వదేశీ పరిజ్ఞానం సహాయంతో కోచ్‌లను తయారు చేస్తోంది. ఈ 9 రైళ్లలో అత్యధికంగా త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కేటాయించారు. 

ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం.. త్వరలోనే అందుబాటులోకి రానున్న 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు సంబంధించి ప్రస్తుతానికి 5 మార్గాలు ఖరారు కాగా మరో మూడింటిని దక్షిణాది రాష్ట్రాలకు కేటాయించినట్టు తెలుస్తోంది. మిగిలిన ఒక్క మార్గం విషయంలోనే కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రూట్ 1 : ఇండోర్ - జైపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రూట్ 2: జైపూర్ - ఉదయ్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రూట్ 3: పూరి - రూర్కెలా వందే భారత్ ఎక్స్‌ప్రెస్

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రూట్ 4: పాట్నా-హౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రూట్ 5: జైపూర్-చండీగఢ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ రూట్స్ : 
ఇండియాలో 50 మార్గాలను కవర్ చేస్తూ 25 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు కవర్ రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ జాబితాలో నాలుగు నార్తర్న్ జోన్‌లో రాకపోకలు సాగిస్తుండగా మరో 3 సదరన్ సెంట్రల్ జోన్‌లలో, 2 వెస్ట్రన్ జోన్లలో నడుస్తున్నాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు అందుబాటులోకి వచ్చిన మిగతా జోన్లలో ఒక్కొక్కటి చొప్పున సేవలు అందిస్తున్నాయి.

ఇది కూడా చదవండి : Maruti Suzuki Cars Discounts: మారుతి సుజుకి కార్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్.. పండగకి కొత్త కారు కొనేస్తే పోలా

G20 ప్రతినిధులను ఆకట్టుకున్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్ రైళ్లు 
G20 సదస్సు కోసం భారత్‌కి వచ్చిన జి20 దేశాలకు చెందిన మీడియా ప్రతినిధుల బృందం గాంధీనగర్ - ముంబై మార్గంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణించింది. " వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణం తమని ఎంతో ఆకట్టుకుంది " అని సదరు మీడియా ప్రతినిధుల బృందం హర్షం వ్యక్తంచేసింది. ఇది కూడా చదవండి : 
Central Govt Schemes: కేంద్ర ప్రభుత్వం సూపర్ స్కీమ్.. ఉచితంగా కుట్టు మిషన్లు.. అసలు విషయం ఇదే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News