Best Foods To Eat After Fever: జర్వం నుంచి ఉపశమనం పొందాలనుకుంటున్నారు? ఈ ఆహార పదార్థాలు తీసుకోండి!

Foods To Eat After Fever: వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా చాలా మంది జ్వరంతో బాధపడుతూ ఉంటారు. దీని కారణంగా శరీరంలో నీరసం, అలసట వంటి సమస్యలు తలెత్తుతాయి. జ్వ‌రం కార‌ణంగా శ‌రీరం కొన్ని పోషకాలను కోల్పోతాము. అయితే తిరిగి శక్తి పొందడానికి కొన్ని రకమైన ఆహార పదార్థాలు సహాయపడుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల శక్తిని పొందవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 10, 2024, 11:14 AM IST
Best Foods To Eat After Fever: జర్వం నుంచి ఉపశమనం పొందాలనుకుంటున్నారు? ఈ ఆహార పదార్థాలు తీసుకోండి!

Foods To Eat After Fever: చ‌లికాలంలో జర్వం, దగ్గు, జలుబు స‌మ‌స్యలు ఎక్కువ‌గా వస్తుంటాయి. జ్వరం కారణంగా చాలా మంది నీరసంగా కనిపిస్తుంటారు. దీనికి కారణం శరీరంలో పోషకాలు కోల్పవడం వల్ల శక్తి తగ్గుతుంది. అయితే తిరిగి శ‌క్తి పొందడానికి కొన్ని రకమైన ఆహార పదార్థాలు తీసుకోవడం చాలా అవసరం. అయితే  జర్వం తగ్గిన తర్వత తీసుకోవాల్సిన ఆహార పదార్థాల్లో ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

✦ జర్వం తగ్గడానికి పెరుగు, కిచిడీ తీసుకోవడం వల్ల జీర్ణశక్తిని పెంచడంతో పాటు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 

✦ వెజిటేబుల్ దాలియాను తీసుకోవడం వల్ల ఆహారం జీర్ణమవ్వడంతో పాటు అనేక రకాల విటమిన్స్‌, మినరల్స్‌ను పొందవచ్చు.

✦ దాల్‌ సూప్‌ తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

✦ జర్వం ఎక్కువగా ఉన్నప్పుడు లేద తగ్గిన తరువాత కొబ్బరి నీళ్లు తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్యను తగ్గిస్తుంది.

✦ అరటిపండ్లు తీసుకోవడం వల్ల ఆహారం  జీర్ణ‌మ‌వ్వ‌డంలో  మేలు చేస్తుంది.

Also read: Potassium Deficiency: పొటాషియం లోపిస్తే శరీరంలో ఏయే లక్షణాలు కన్పిస్తాయి, కారణమేంటి

✦ దానిమ్మ గింజ‌లు తినడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు, విట‌మిన్స్, మిన‌ర‌ల్స్  శరీరానికి లభిస్తాయి.

✦ అల్లంతో టీని తీసుకోవడం వల్ల యాంటీ ఇన్ ప్లామేట‌రీ గుణాలు శరీరానికి అందుతాయి.

✦ వెజిటేబుల్ సూప్ ను తీసుకోవడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు శ‌రీర ఆరోగ్యాన్ని మెరుగుపర‌చ‌డంలో సహాయపడుతాయి.

జ్వ‌రం త‌గ్గిన త‌రువాత ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల త్వ‌ర‌గా కోలుకోవ‌చ్చ‌ని  ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also read: Sperm Count: ఈ గింజలు మగవారి శక్తిని అమాంతం పెంచుతాయి..వీర్యకణాల సంఖ్య కూడా బూస్ట్ అవుతుంది..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News