Omicron Variant: అత్యంత వేగంగా సంక్రమించే ఒమిక్రాన్ ఊపిరితిత్తుల్ని డ్యామేజ్ చేయదా

Omicron Variant: ఇండియా ఇప్పుడు కరోనా థర్డ్‌వేవ్ ముప్పు నేపధ్యంలో అత్యంత వేగంగా సంక్రమిస్తున్న ఒమిక్రాన్ ఆందోళన ఎక్కువైంది. అయితే ఈ ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం ఊపిరితిత్తులపై ఏ మేరకు ఉందో తెలుసుకుందాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 5, 2022, 07:25 AM IST
 Omicron Variant: అత్యంత వేగంగా సంక్రమించే ఒమిక్రాన్ ఊపిరితిత్తుల్ని డ్యామేజ్ చేయదా

Omicron Variant: ఇండియా ఇప్పుడు కరోనా థర్డ్‌వేవ్ ముప్పు నేపధ్యంలో అత్యంత వేగంగా సంక్రమిస్తున్న ఒమిక్రాన్ ఆందోళన ఎక్కువైంది. అయితే ఈ ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం ఊపిరితిత్తులపై ఏ మేరకు ఉందో తెలుసుకుందాం.

కరోనా కొత్త వేరియంట్ ప్రపంచమంతా వణికిస్తోంది. ఇండియాలో చాపకిందనీరులా విస్తరిస్తూ కలవరం రేపుతోంది. దేశంలో రోజురోజుకూ ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. మరోవైపు దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కోవిడ్ థర్డ్‌వేవ్ (Corona Third Wave) ప్రారంభమైందని ఇప్పటికే వైద్యులు ప్రకటించారు. ఈ క్రమంలో ఒమిక్రాన్ సంక్రమణ, తీవ్రతపై చర్చ ఎక్కువైంది. ఒమిక్రాన్ మిగిలిన వేరియంట్లతో పోలిస్తే అత్యంత వేగంగా సంక్రమిస్తోంది. ఇక మనిషి శరీరం లోపల హ్యమన్ రెస్పిరేటరీ ట్రాక్ టిష్యూలో డెల్టా వేరియంట్‌తో పోలిస్టే 70 రెట్లు వేగంగా రెట్టింపవుతుందట. హాంకాంగ్ యూనివర్సిటీ పరిశోధకులు తేల్చిన విషయమిది. అదే సమయంలో డెల్టా వేరియంట్‌తో పోలిస్తే 48 గంటల అనంతరం పీక్స్‌కు చేరుతుంది. 
 
ఇంత వేగంగా సంక్రమిస్తున్నా..ఇంత వేగంగా మ్యూటేట్ అవుతున్నా ఒమిక్రాన్ వేరియంట్ (Omicron Variant) తీవ్రత తక్కువేనని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఊపిరితిత్తుల్ని ఈ వేరియంట్ పెద్దగా నష్టం చేయదంటున్నారు. అమెరికా, జపాన్‌కు చెందిన పరిశోధకులు చేసిన ఓ అధ్యయనం ప్రకారం కూడా ఒమిక్రాన్ వేరియంట్ ఊపిరితిత్తుల్ని దెబ్బతీయదు. ఇతర వేరియంట్లతో పోలిస్తే అంత ప్రమాదకరం కాదంటున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ స్పైక్ ప్రోటీన్‌లో 36 మ్యూటేషన్ల్ ఉన్నాయని ఇప్పటికే తేలింది. అయితే వ్యాక్సినేషన్ తీసుకున్నవారిలో ఒమిక్రాన్ ప్రభావం ఉంటుందా లేదా అనేది ఇంకా కచ్చితంగా తేలలేదు. వ్యాక్సిన్ కల్గించే రోగ నిరోధకత నుంచి క్రమంగా ఒమిక్రాన్ వేరియంట్ తప్పించుకుంటుందని తెలుస్తోంది. ఇతర వేరియంట్లతో పోలిస్తే..ఒమిక్రాన్ 4 రెట్లు ఎక్కువ ఇన్‌‌‌ఫెక్ట్ చేస్తుంది. కరోనా వైరస్ ఒరిజినల్ వేరియంట్ లేదా డెల్టా వేరియంట్‌తో పోల్చి చూసినప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ సెల్స్‌ను తక్కువగా ప్రభావితం చేస్తుంది. 

ఒమిక్రాన్ వేరియంట్ ఇన్‌ఫెక్షన్ ఊపిరితిత్తులపై (Omicron on Lungs) కంటే గొంతుపై ఎక్కువగా ఉండవచ్చంటున్నారు. సంక్రమణ వేగంగా ఉంటున్నందున కోవిడ్ సాధారణ వైరస్ సమయంలో తీసుకున్న జాగ్రత్తల కంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవల్సిన అవసరముందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రజలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలంటున్నారు. 

Also read: Sugar Craving: స్వీట్స్ కోరిక అణచుకోలేకపోతున్నారా..సులభమైన ఈ చిట్కాలు పాటించండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News