Winter Smog care: పొగమంచు నుంచి మీ లంగ్స్‌ను కాపాడుకునే అద్భుతమైన పద్ధతులు

Winter Smog care: స్మాగ్ అనేది చాలా ప్రమాదకరం. ఊపిరితిత్తులు బలహీనమైపోతాయి. ఫలితంగా లంగ్స్ సంబంధిత వ్యాధులు తలెత్తే ప్రమాదముంది. ఈ స్మాగ్ నుంచి రక్షించుకోవాలంటే కొన్ని చిట్కాలున్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 2, 2023, 05:37 PM IST
Winter Smog care: పొగమంచు నుంచి మీ లంగ్స్‌ను కాపాడుకునే అద్భుతమైన పద్ధతులు

చలికాలంలో సహజంగానే ఫాగ్ పెరిగిపోతుంటుంది. ఇది ఊపిరితిత్తుల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తుంది. చలికాలంలో అందుకే లంగ్స్ సంరక్షణ చాలా అవసరం. లేకపోతే స్మాగ్ కారణంగా లంగ్స్ డ్యామేజ్ అవుతాయి. ఫాగ్ అనేది లంగ్స్‌ను బలహీనం చేస్తుంది. ఫలితంగా జలుబు, దగ్గు, బ్రోంకైటిస్, నిమోనియా, ఆస్తమా వంటి గంభీరమైన రోగాల ముప్పుు పెరుగుతుంది. అయితే కొన్ని చిట్కాలతో ఊపిరితిత్తుల్ని సంరక్షించుకోవచ్చు.

స్మాగ్ అంటే ఏమిటి

స్మాగ్ అంటే ఫాగ్, పొగ రెండూ కలిగిన మిశ్రమం. కాలుష్యంతో నిండిన ఈ స్మాగ్ ఊపిరితిత్తులకు పట్టేస్తుంది. ఫలితంగా లంగ్స్‌కు హానికారకమౌతుంది. చలికాలంలో స్మాగ్ పెరగడం వల్ల కాలుష్యం ప్రభావంతో ఊపిరితిత్తులపై దుష్ప్రభావం పడుతుంది. దీన్నించి కాపాడుకునేందుకు కొన్ని చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. 

మాస్క్ ధారణ

మాస్క్ కేవలం వైరస్ నుంచే కాదు..కాలుష్యం నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. నోరు, ముక్కు కవర్ అయ్యేలా మాస్క్ ధరించడం వల్ల స్మాగ్ ఊపిరితిత్తులకు చేరదు. అందుకే ఎక్కడికైనా వెళ్లేటప్పుడు మాస్క్ తప్పకుండా ధరించాలి. ఇలా చేయడం వల్ల లంగ్స్ బలంగా ఉంటాయి.

బీడీ, సిగరెట్‌కు దూరం

సిగరెట్ , బీడీలు ఊపిరితిత్తుల్ని బలహీనం చేస్తాయి. ఈ రెండింటి పొగ నేరుగా లంగ్స్‌లో వెళ్లి ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. చాలామంది శరీరానికి వేడి కల్గించేందుకు ధూమపానం చేస్తుంటారు. కానీ ఇది మంచిది కాదు. ఆరోగ్యంగా ఉండాలనుకుంటే..సిగరెట్, బీడీ వంటి వస్తువులకు దూరంగా ఉండాలి.

కాలుష్యానికి చెక్

చలికాలంలో చాలామంది మంటలతో చలి కాచుకుంటారు. ఈ మంట కాలుష్యాన్ని వ్యాపింపచేస్తుంది. కాలుష్యపు గాలి వల్ల స్మాగ్ పెరుగుతుంది. స్మాగ్ నుంచి కాపాడుకోవాలంటే చలిమంటలకు దూరంగా ఉండాలి.

ఇమ్యూనిటీ పెరగడం

స్మాగ్ నుంచి మీ శరీరాన్ని రక్షించుకోవాలంటే ముందు మీ బాడీని బలంగా ఉంచుకోవాలి. ఇమ్యూనిటీ పెంచే పదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలి. తులసి, అల్లం వంటి పదార్ధాలు సేవించాలి. ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి.

Also read: Health Benefits: రోజూ ఆ రసం తాగితే..హెయిర్ ఫాల్, అధిక బరువు, రక్తపోటు..అన్ని సమస్యలు మాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News