Kerala Zika Virus Cases: కేరళలో మరో జికా వైరస్ పాజిటివ్ కేసు నమోదు, ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటన

Zika Virus Cases in Kerala: కరోనా థర్డ్ వేవ్ ఆందోళన పెంచుతున్న సమయంలో జికా వైరస్ కేసులు నమోదు కావడంతో పరిస్థితులు దిగజారకుండా కేరళ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఇటీవల 13 మందికి జికా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 11, 2021, 11:20 AM IST
  • దేశంలో కేరళలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది
  • కేరళలో 15కు చేరిన జికా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య
  • కరోనా వైరస్‌లా గాలి ద్వారా వ్యాప్తి చెందదని చెప్పిన నిపుణులు
Kerala Zika Virus Cases: కేరళలో మరో జికా వైరస్ పాజిటివ్ కేసు నమోదు, ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటన

Zika Virus Cases in Kerala: దేశ వ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ రాకూడదని, వస్తే పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతుంటే కేరళలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్న సమయంలో జికా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. 

కరోనా థర్డ్ వేవ్ ఆందోళన పెంచుతున్న సమయంలో జికా వైరస్ కేసులు నమోదు కావడంతో పరిస్థితులు దిగజారకుండా కేరళ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఇటీవల 13 మందికి జికా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపింది. ఆపై మరో జికా కేసులు గుర్తించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో మరో జికా వైరస్ పాజిటివ్ కేసు (Kerala Zika Virus Cases) నమోదైంది. ఈ విషయాన్ని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. కేరళలో జికా వైరస్ కేసులపై ఆందోళన అక్కర్లేదని నిపుణులు చెబుతున్న నేపథ్యంలో మరో పాజిటివ్ కేసు నిర్ధారించారు. 

Also Read: Bharat Biotech: కోవాగ్జిన్ ఫేజ్ 3 ట్రయల్స్ ఫలితాలు విడుదల చేసిన WHO చీఫ్ సైంటిస్ట్

జికా వైరస్ గాలిలోని కణాల ద్వారా వ్యాప్తి చెందే అవకాశమే లేదని ప్రజలు దీని గురించి అంతగా ఆందోళన చెందనక్కర్లేదని నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్ (Coronavirus) తరహాలో ఇతరులను తాకడం ద్వారా సైతం జికా వైరస్ వ్యాప్తి చెందదని, దోమకాటు ద్వారా ఇతరులకు సోకుతుందని తెలిపారు. జికా వ్యాప్తి, నియంత్రణ చర్యలలో భాగంగా ఆరుగురు సభ్యులతో కూడిన నిపుణుల టీమ్ కేరళలోని పలు జిల్లాల్లో పర్యటిస్తోంది. జనవరి 2017లో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జికా వైరస్ కేసును ఇండియాలో తొలిసారిగా గుర్తించినట్లు పేర్కొన్నారు. 

Also Read: India Corona Cases: కరోనా పాజిటివ్ కేసుల కంటే Covid-19 రికవరీలే అధికం, ఇండియాలో తాజాగా 895 మరణాలు

కేరళలో ఇటీవల తొలిసారిగా జికా వైరస్ కేసులను గుర్తించారు. తిరువనంతపురం జిల్లాలోని ఓ ఆసుపత్రిలో గర్భిణీకి (Zika virus symptoms in pregnant women) టెస్టులు నిర్వహించగా జికా వైరస్ లక్షణాలు స్వల్ప మోతాదులో ఉన్నట్టు గుర్తించారు. కరోనా వైరస్, జికా వైరస్‌లకు చాలా వ్యత్యాసం ఉందని, కరోనా అతివేగంగా పలు మార్గాల ద్వారా ఇతరులకు వ్యాపిస్తుందన్నారు. అయితే జికా వైరస్ దోమకాటు ద్వారా వ్యాప్తిచెందుతుందని దోమలు లేకుండా చూసుకుంటే సరిపోతుందన్నారు. త్వరలోనే దీనికి పరిష్కారం, చికిత్స అందుబాటులోకి వస్తాయన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News