Hyderabad: సమాజంలో ఒంటరి మహిళలకు చేయూతనిచ్చేందుకు ఆర్జే ఇన్సిపిరేషన్ హ్యాండ్స్ సంస్థ పని చేస్తోందని.. వారి సేవలు అభినందనీయమని తెలంగాణ ఇన్‌కమ్ ట్యాక్స్ కమిషనర్ జీవన్ లాల్, యువ హీరో నరేన్ వనపర్తి తెలిపారు. తెలంగాణలో ఒంటరి మహిళల కోసం నడుస్తున్న సంస్థ ఇదేనని చెప్పవచ్చు. స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న ఈ సంస్థకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాలు కూడా ఈ సంఘానికి సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.
Also Read: KCR Movie: కేసీఆర్ పాలన మాదిరి.. 'కేసీఆర్' సినిమా సూపర్ హిట్ కావాలి
హైదరాబాద్‌లోని ఆర్జే ఇన్సిపిరేషన్ హ్యాండ్స్ భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆదాయపు పన్ను కమిషనర్ జీవన్ లాల్ రూ.25 వేలు విరాళంగా ఇచ్చారు. అనంతరం ఆర్జే ఇన్సిపిరేషన్ హ్యాండ్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఒంటరి మహిళల గురించి పాటు పడే సంస్థలు చాలా అరుదు. ఒంటరి మహిళలకోసం పని చేస్తున్న ఏకైక సంస్థ ఇదే' అని తెలిపారు.
Also Read: DK Aruna: 'లగచర్ల లడాయి' తీవ్ర రూపం.. డీకే అరుణ అరెస్ట్‌తో తీవ్ర ఉద్రిక్తత
'ఒంటరి మహిళల కష్టాలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు ఇంట్లో మగాడు చేసే పనుల వల్లే మహిళలకు కష్టాలు వస్తాయి' అని కమిషనర్ జీవన్ లాల్ వివరించారు. ఒంటరి మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వాలు కూడా ప్రత్యేక పథకాలు తీసుకురావాల్సి ఉందని గుర్తుచేశారు. ప్రభుత్వాలు కూడా ఒంటరి మహిళల కోసం ప్రత్యేకమైన పథకాలు తీసుకువచ్చేలా ఈ సంస్థ రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాయాలని సూచించారు.
'భారతదేశంలో ఏడున్నర కోట్ల ఒంటరి మహిళలు ఉన్నారు. వీరందరి కోసం ప్రభుత్వం కచ్చితంగా ఆలోచించాలి. వీరికి ఏ సహాయం కావాలన్నా తోచిన రీతిలో నేను ముందుండి వీలైన సాయాన్ని అందిస్తా’ అని కమిషనర్ జీవన్ లాల్ ప్రకటించారు. ఆర్జే ఇన్సిపిరేషన్ హ్యాండ్స్ నిర్వాహకులు ఉమా కార్తీక్ మాట్లాడుతూ.. తండ్రి లేకుండా పిల్లల్ని పెంచడం సాధారణ విషయం కాదన్నారు. 'ఒంటరి మహిళల కష్టాలు నాకు తెలుసు. నాకు వీలైనంత వరకు సాయం చేయాలని ఈ సంస్థను స్థాపించా' అని వివరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు పిల్లలకు స్కూల్ బాగ్స్ అందించగా.. వ్రామ్ ప్రతినిధులు లంచ్ బాక్స్ బాగ్స్ అందించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter