అలా అయితే మీరు ఓటమిని అంగీకరించినట్లే : కేజ్రీవాల్

భారతీయ జనతా పార్టీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో తెలపాలని సవాలు విసిరిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్, బుధవారం వరకు గడువిచ్చిన సంగతి తెలిసిందే. నేడు మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను బహిరంగ చర్చకు రావాలని  ఆహ్వానించారు. చర్చ బహిరంగ ప్రదేశంలో, మీకు నచ్చిన యాంకర్‌తో ఢిల్లీ ప్రజల ముందుండాలని ఆయన అన్నారు.

Last Updated : Feb 5, 2020, 05:05 PM IST
అలా అయితే మీరు ఓటమిని అంగీకరించినట్లే : కేజ్రీవాల్

న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో తెలపాలని సవాలు విసిరిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్, బుధవారం వరకు గడువిచ్చిన సంగతి తెలిసిందే. నేడు మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను బహిరంగ చర్చకు రావాలని  ఆహ్వానించారు. చర్చ బహిరంగ ప్రదేశంలో, మీకు నచ్చిన యాంకర్‌తో ఢిల్లీ ప్రజల ముందుండాలని ఆయన అన్నారు. అయితే బీజేపీ నుండి ఎవరో ఒక నేత జవాబిస్తాడని మాత్రం తప్పించుకోకండి అది మీరు ఓటమిని అంగీకరించినట్లే అని ఆయన అన్నారు. 

బీజేపీకి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే సత్తా లేదని మరోసారి రుజువైందని ఆయన అన్నారు. తన ఉనికి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రజలలో స్పందన లేదన్నారు. దేశంలో మొట్టమొదటి సారిగా అభివృద్ధి పేరుతో తాము ఓటు అడుగుతున్నామన్నారు. ఫిబ్రవరి 8న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కేవలం మూడు రోజులే ఉండటంతో అన్నీ ప్రధాన పార్టీల మధ్య ఎన్నికల వాతావరణం వేడెక్కింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News