Madhya pradesh: పెళ్లింట ఘోరం.. 13 మంది మృతి.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

Madhya pradesh: పెళ్లి ఇంట విషాదకర ఘటన చోటు చేసుకుంది. తమ బంధువులు ఇంట శుభకార్యం కోసం వచ్చి, అకాల మరణం చెందారు. ఈ ఘటనలో 13 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

Written by - Inamdar Paresh | Last Updated : Jun 3, 2024, 12:52 PM IST
  • విషాదకరంగా మారిన పెళ్లి వేడుక..
  • సహయక చర్యలకు ఆదేశించిన ద్రౌపదీ ముర్ము..
Madhya pradesh: పెళ్లింట ఘోరం.. 13 మంది మృతి.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

Road accident in Madhya pradesh: కొన్నిసార్లు రోడ్డు మీద మన తప్పిదాలు లేకున్న ప్రమాదాలు జరుగుతున్నాయి. తాగి కొందరు ఇష్టమున్నట్లు వాహనాలు నడిపిస్తుంటారు. మరికొందరు రాంగ్ రూట్ లో వచ్చి వెహికిల్స్ లను బలంగా ఢీకొడుతుంటారు. ఇలాంటివి మనం తరచుగా చూస్తుంటాం. కొన్నిసార్లు వివాహా వేడుకలు, పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలో విషాదాలు చోటు చేసుకున్నాయి. పెళ్లికి సంబంధించిన వాహనం బోల్తా పడటం, పెళ్లిళ్లలో ఊహించని ఘటనలు జరుతుంటాయి. ఇలాంటి వాటిల్లో కొన్నిసార్లు అనుకొని విధంగా ప్రమాదాలు జరుగుతుంటే, మరికొన్నిసార్లు మాత్రం.. నెగ్లీజెన్సీ వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. అచ్చం ఇలాంటి కోవకు చెందిన ఘటన ప్రమాదం ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

Read more: Snakes Video: బాప్ రే.. కింగ్ కోబ్రాకు షాంపుతో స్నానం... వీడియో వైరల్..

పూర్తి వివరాలు..

మధ్య ప్రదేశ్ లోని ఆదివారం విషాదకర సంఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్ కు చెందిన కొందరు తమ బంధువుల ఇంట్లో జరుగుతున్న పెళ్లికి అటెండ్ కావడానికి, రాజ్ గఢ్ కు వచ్చారు. ఈనేపథ్యంలో.. పెళ్లి వారు వెళ్తున్న ట్రాక్టర్ , ట్రాలీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో.. సంఘటన స్థలంలోనే 13 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలలో పాల్గొన్నారు.

పెళ్లిబృందం వారు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైన ఘటనలో.. .. నలుగురు చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ ఘటనలో.. 13 మంది దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. కన్నీళ్లు తెప్పిస్తున్న ఈ విషాదకర ఘటన.. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌ జిల్లాలో ఆదివారం రాత్రి సంభవించింది.

స్థానికంగా పోలీసులు, ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గలకారణాలపై ఆరా తీస్తున్నారు.  ప్రమాద ఘటనపై జిల్లా కలెక్టర్, స్థానిక అధికారులతో మాట్లాడారు. ఇదిలా ఉండగా..  పెళ్లి వారు రోడ్డు ప్రమాద ఘటనలో చనిపోవడంపై.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.

Read more: Cop cpr on monkey: హ్యాట్సాఫ్ సార్.. సీపీఆర్ చేసి కోతిని కాపాడిన పోలీసు.. వీడియో వైరల్..

రాజస్థాన్ సీఎం,  భజన్ లాల్ శర్మ కూడా దీనిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలు, బాధితులకు సంతాపం తెలిపారు. స్థానిక అధికారులతో మాట్లాడి, మెరుగైన వైద్య సేవలు అందించాలని  ఆదేశించారు. ఈ ఘటన మాత్రం తీవ్ర విషాకరంగా మారింది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News