Uttar Pradesh: యూపీలో ఘోర దుర్ఘటన సంభవించింది. మట్టిని తెచ్చేందుకు కాలువ దగ్గరకు వెళ్లి ఐదుగురు బాలికలు నీటిలో మునిగి (Five Girls Drown) మృతి చెందిన ఘటన సుల్తాన్‌పూర్ జిల్లా మోతీగార్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటుచేసుకుంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఐదుగురు బాలికల మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా మేజిస్ట్రేట్ మరియు సీనియర్ పోలీసు అధికారులను ఆదేశించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం మధ్యాహ్నం మట్టిని తేవడానికి ఐదుగురు బాలికలు కలిగంజ్ బజార్‌లోని కాలువ దగ్గరకు వెళ్లారు. ఈ క్రమంలో కాలువలో పడి ఆ ఐదుగురు బాలికలు మృతి చెందారు. కేకలు విని సంఘటనా స్థలానికి చేరుకున్న గ్రామస్థులు పెమాపూర్ ఖజూరిలో నివాసముంటున్న ఆషియా (13), అస్మీన్ (13), నందిని (13), అంజాన్ (13) అనే నలుగురిని బయటకు తీయగలిగారు. నలుగురు బాలికల మరణాన్ని సుల్తాన్‌పూర్ డీఎం రవీష్ గుప్తా గతంలో ధృవీకరించారు. ఐదవ బాలిక అయిన తొమ్మిదేళ్ల ఖుషీ మృతదేహాన్ని సాయంత్రానికి కనుగొన్నారు. ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
#UPCM @myogiadityanath ने जनपद सुलतानपुर में ड्रेन में डूबने से हुई जनहानि पर गहरा दुःख प्रकट किया है।
मुख्यमंत्री जी ने दिवंगतों की आत्मा की शांति की कामना करते हुए शोक संतप्त परिजनों के प्रति संवेदना व्यक्त की है।
— CM Office, GoUP (@CMOfficeUP) October 22, 2022
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook