Kashmir Encounter: కశ్మీర్​లో ఎన్​కౌంటర్....ఐదుగురు ఉగ్రవాదులు హతం..మృతుల్లో జేఈఎం టాప్ కమాండర్..

Kashmir Encounter: జమ్మూ కశ్మీర్​లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఎన్​కౌంటర్​ జరిగింది. ఈ కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు మృతి చెందారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 30, 2022, 08:00 AM IST
  • జమ్మూ కశ్మీర్​లో ఎన్ కౌంటర్
  • ఐదుగురు ఉగ్రవాదులు హతం
  • జేఈఎం టాప్ కమాండర్ మృతి
Kashmir Encounter: కశ్మీర్​లో ఎన్​కౌంటర్....ఐదుగురు ఉగ్రవాదులు హతం..మృతుల్లో జేఈఎం టాప్ కమాండర్..

Jammu and Kashmir Encounter: జమ్మూ కశ్మీర్​లోని పుల్వామాలోని నైరా, బుద్గామ్‌లలో జరిగిన ఎన్‌కౌంటర్‌లలో భద్రతాదళాల కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతి చెందిన వారిలో జైషే మహమ్మద్(JeM) టాప్ కమాండర్ జాహిద్ వానీ ( Zahid Wani) కూడా ఉన్నట్లు కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ ప్రకటించారు. 

''గత 12 గంటల్లో జరిగిన వేర్వేరుఎన్‌కౌంటర్‌లలో పాకిస్తాన్‌కు చెందిన ఎల్ఈటీ, జేఈఎం ఉగ్రవాద సంస్థలకు చెందిన ఐదుగురు ముష్కరులను హతమార్చాం. మరణించిన వారిలో జేఈఎం టాప్ కమాండర్‌ జాహిద్‌ వానీ, పాకిస్థాన్‌ ఉగ్రవాది ఉన్నారు. మాకు పెద్ద విజయం'' ’అని కశ్మీర్‌ ఐజీపీ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Also Read: ఆస్తి కోసం కన్నతల్లినే గెంటేసిన క్రూరుడు.. నవజ్యోత్ సిద్ధూపై సోదరి సంచలన ఆరోపణలు

పుల్వామాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో (Pulwama Encounter) జేఈఎం అగ్ర కమాండర్ జాహిద్ వనీతో సహా 4 మంది జేఈఎం ఉగ్రవాదులు హతమవ్వగా...మరో పాకిస్థానీ ఉగ్రవాది కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఎల్ఈటీకి (Lashkar-e-Taiba) అనుబంధంగా పనిచేస్తున్న ఓ స్థానిక ఉగ్రవాదిని బుద్గామ్‌లో (Budgam) భద్రతాదళాలు మట్టుబెట్టాయి. ఈ ఆపరేషన్‌లో ఏకే 56 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.  ఒక్క జనవరి నెలలోనే 11 ఎన్‌కౌంటర్‌లు జరగగా.. 8 మంది విదేశీయులు సహా 21 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News