7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ ఇటీవల 3 శాతం పెరిగింది. అటు పెన్షనర్ల డీఆర్ కూడా 3 శాతం పెరిగింది. దాంతో మొత్తం డీఏ 53 శాతం కాగా ఈ డీఏ కనీస వేతనంలో విలీనం అవుతుందా లేదా అనే చర్చ మొదలైంది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది. ఒకవేళ 53 శాతం డీఏ కనీస వేతనంలో కలిస్తే ఉద్యోగుల జీతం భారీగా పెరగనుంది. అంతేకాకుండా డీఏ జీరో నుంచి లెక్కిస్తారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల జూలై నుంచి పెంచాల్సిన డీఏను 3 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దాంతో 50 శాతంగా ఉన్న డీఏ 53 శాతమైంది. నిబంధనల ప్రకారం డీఏ 50 శాతం దాటితే కనీస వేతనంలో కలిపి ఆ తరువాత జీరో నుంచి డీఏ లెక్కింపు ఉంటుంది. ఉద్యోగుల డీఏ మరోసారి 2025 జనవరిలో పెరగనుంది. ఈ క్రమంలో అప్పటి వరకూ 53 శాతం డీఏను కనీస వేతనంలో కలుపుతారా లేదా అనేది తేలాల్సి ఉంది. డీఏను 3 శాతం పెంచడం ద్వారా 50 నుంచి 53 శాతం చేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం భారీ నజరానా ఇచ్చింది. జూలై నుంచి పెరిగిన డీఏ అమల్లోకి రానుంది. మరి డీఏ 53 శాతం కావడంతో కనీస వేతనంలో కలపాల్సి ఉంటుంది. అదే జరిగితే ఉద్యోగుల జీతం భారీగా పెరగనుంది. అందుకే ఉద్యోగులు డీఏను కనీస వేతనంలో ఎప్పుడు కలుపుతారా అని ఎదురు చూస్తున్నారు.
అయితే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై స్పష్టత ఇచ్చినట్టుగా తెలుస్తోంది. బిజినెస్ టుడేలో వచ్చిన కథనం ప్రకారం మొత్తం డీఏ 50 శాతం దాటినా సరే కనీస వేతనంలో కలిపే ఆలోచన లేనట్టుగా తెలుస్తోంది. డీఏ 50 శాతం దాటితే కనీస వేతనంలో కలపాలనేది 5వ వేతన సంఘంలో ఇచ్చిన సిఫారసు. కానీ తరువాత ఎప్పుడూ ఈ సిఫారసు చేర్చలేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పట్లో డీఏను కనీస వేతనంలో చేర్చే ఆలోచన లేదని చెప్పినట్టు సమాచారం.
6, 7 వేతన సంఘాల్లో డీఏ 50 శాతం దాటితే కనీస వేతనంలో కలపాలనే సిఫారసు లేనందున కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదు. ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ ప్రతి యేటా రెండు సార్లు కేంద్ర ప్రభుత్వం పెంచుతోంది. జనవరి నెల డీఏ పెంపు మార్చ్‌లో ప్రకటన ఉంటే జూలై పెంపు ప్రకటన సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో ఉంటోంది. అదే విధంగా మరో రెండు నెలల్లో అంటే జనవరి 2025 డీఏ పెంపు ప్రకటన మార్చ్ 2025లో ఉండవచ్చని అంచనా.
Also read: BSNL Long Term Plans: కేవలం బీఎస్ఎన్ఎల్ మాత్రమే అందిస్తున్న ఏకైక ప్లాన్, 395 రోజుల వ్యాలిడిటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి