లక్ష దాటిన కరోనా కేసులు.. ఎయిమ్స్ వైద్యులకు కరోనా పాజిటివ్..

కరోనా మహమ్మారిని (Covid-19) అడ్డుకుంటున్న పోరాటయోధులైన వైద్యులే ఈ వైరస్‌ బారిన పడుతుండటం సర్వత్రా ఆందోళన కల్గిస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఒక లక్ష పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Last Updated : May 19, 2020, 01:05 AM IST
లక్ష దాటిన కరోనా కేసులు.. ఎయిమ్స్ వైద్యులకు కరోనా పాజిటివ్..

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని (Covid-19) అడ్డుకుంటున్న పోరాటయోధులైన వైద్యులే ఈ వైరస్‌ బారిన పడుతుండటం సర్వత్రా ఆందోళన కల్గిస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఒక లక్ష పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 57,931( Covid Active cases) యాక్టీవ్ కేసులు కాగా. 39,233 మంది కరోనా సోకిన ఆరు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఈ వైరస్ బారిన పడి 3156 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే దేశ రాజధాని (Delhi)ఢిల్లీలో గత రెండు నెలలుగా కరోనా రోగులకు చికిత్స అందిస్తోన్న ఎయిమ్స్‌ ఆసుపత్రిలో ఇప్పటివరకు 92మందికి ఈ వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది కూడా ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. 

Also Read: 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఒట్టి డొల్ల, మోసం.. కేంద్రంపై విరుచుకుపడిన సీఎం కేసీఆర్

AIIMS ఆర్థోపెడిక్‌ విభాగానికి చెందిన అధ్యాపకునికి కూడా కరోనా పాజిటివ్‌ రావడంతో దాదాపు పదిమంది సిబ్బందిని క్వారంటైన్‌లో ఉంచారు. మొత్తం 92మందిలో ఒకరు అధ్యాపకులు, ఇద్దరు రెసిడెంట్‌ వైద్యులు, 13మంది నర్సింగ్‌ సిబ్బంది, 45మంది సెక్యూరిటీ గార్డులతో పాటు మరో 12మంది పారిశుద్ధ్య కార్మికులకు వైరస్‌ సోకినట్లు అధికారులు ప్రకటించారు. ఇదిలాఉండగా దిల్లీలో ఇప్పటివరకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పదివేలు దాటగా 160మంది మరణించారు. దేశంలో అత్యధికంగా (Maharastra) మహారాష్ట్రలో 35,058 కేసులు నమోదయ్యాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News