Jammu kashmir: మారుతున్న రాజకీయ సమీకరణాలు, కొత్త కూటమి ఏర్పాటు

జమ్మూకశ్మీర్ లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఆర్టికల్ 370 పునరుద్ధరణ డిమాండ్ తో రాజకీయపార్టీలు ఉమ్మడి పోరాటానికి సిద్ధమయ్యాయి. నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, కాంగ్రెస్ సహా మరో నాలుగు పార్టీలు ఏకమై..పీపుల్స్ అలయెన్స్ గా ఏర్పడ్డాయి.

Last Updated : Oct 15, 2020, 11:15 PM IST
  • నేషనల్ కాన్ఫరెన్స్ , పీడీపీ, కాంగ్రెస్ సహా మరో నాలుగు పార్టీలతో కొత్త కూటమి
  • ఆర్టికల్ 370 పునరుద్ధరణ లక్ష్యంగా పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్కర్ డిక్లరేషన్ గా నామకరణం
  • జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో కొత్త కూటమి తరపునే పోటీ
Jammu kashmir: మారుతున్న రాజకీయ సమీకరణాలు, కొత్త కూటమి ఏర్పాటు

జమ్మూకశ్మీర్ ( Jammu kashmir ) లో రాజకీయ సమీకరణాలు ( Political Equations ) మారుతున్నాయి. ఆర్టికల్ 370 పునరుద్ధరణ ( Article 370 ) డిమాండ్ తో రాజకీయపార్టీలు ఉమ్మడి పోరాటానికి సిద్ధమయ్యాయి. నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, కాంగ్రెస్ సహా మరో నాలుగు పార్టీలు ఏకమై..పీపుల్స్ అలయెన్స్ గా ఏర్పడ్డాయి.

జమ్ముకాశ్మీర్ కు ప్రత్యేక హోదా( Special status ) కల్పించిన ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి ఏడాది దాటుతోంది. ఆర్టికల్ 370ను రద్దు చేయడమే కాకుండా జమ్మూకశ్మీర్ ( Jammu kashmir ), లడాఖ్ ( Ladakh ) లను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేసింది కేంద్రం. త్వరలో జమ్మూకశ్మీర్ లో ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఈ నేపధ్యంలో అక్కడి రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. బీజేపీ ( BJP ) మినహా మిగిలిన పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 పునరుద్ధరించాలనే డిమాండ్ తో కొత్త కూటమి ఏర్పడింది. ప్రధాన పార్టీలు నేషనల్ కాన్ఫరెన్స్ ( National conference ), పీడీపీ ( PDP ), కాంగ్రెస్ ( Congress ) సహా మరో నాలుగు పార్టీలు సీపీఎం, జమ్మూకశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్, పాంథర్స్ పార్టీ, జమ్మూ కశ్మీర్ అవామీ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలున్నాయి.

దాదాపు ఏడాదికి పైగా నిర్బంధంలో ఉన్న ముఫ్తీ విడుదలైన రోజుల వ్యవధిలోనే అక్కడి రాజకీయ సమీకరణాలు మారాయి. కొత్త కూటమి ఏర్పడింది. శ్రీనగర్ లోని ఓ రహస్య ప్రదేశంలో సమావేశమైన 7 పార్టీలు కొత్త కూటమి ( New Alliance ) ఏర్పాటుకు తీర్మానించాయి. జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370ను రద్దును ఉపసంహరించాలంటూ కేంద్రానికి పంపిన నోట్ పై అన్ని పార్టీల ప్రతినిధులు సంతకాలు చేశారు. సమావేశం అనంతరం మీడియాకు తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. 

జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుకు ఒక్కరోజు ముందు అంటే 2019 ఆగస్టు 4వ తేదీన  శ్రీనగర్ సిటీ గుప్కర్ రోడ్డులోని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్బుల్లా ఇంట్లో అఖిల పక్ష సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఆమోదించిన గుప్కర్‌ డిక్లరేషన్ ( Gupkar Declaration )‌ తీర్మానాన్ని మళ్లీ ముందుకు తీసుకెళ్లాలని ఈ సమావేశంలో పార్టీలు నిర్ణయించాయి. 14 నెలల గృహ నిర్బంధం అనంతరం పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ విడుదలైన తరువాత కొత్త సమీకరణాలు ఊపందుకున్నాయి. కొత్తగా ఏర్పడిన కూటమికి పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్కర్ డిక్లరేషన్ ( People's Alliance for Gupkar declaration ) గా నామకరణం చేసినట్టు ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. 2019 ఆగస్టు 5 కు ముందు పరిస్థితులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. Also read: Pm Modi Assets Value: ప్రధాని మోదీ ఆస్థి విలువెంతో తెలుసా?

Trending News