Actor Siddharth: 'బొమ్మరిల్లు' సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసిన నటుడు హీరో సిద్ధార్థ్(Hero Siddharth). నువ్వొస్తానంటే నేనొద్దంటానా, కొంచెం ఇష్టం..కొంచెం కష్టం సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. తర్వాత సిద్ధార్థ్ చేసిన సినిమాలు తెలుగు ఫ్యాన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అనంతరం సిద్ధార్థ్ తమిళ పరిశ్రమపై దృష్టి పెట్టాడు. ఇటీవల మహాసముద్రం(Maha Samudram) సినిమాతో శర్వానంద్ తో కలిసి తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే సినీ రంగంలోనే సమస్యలపైనే కాకుండా..సమాజంలోని సమస్యలపైనే స్పందిస్తాడు సిద్ధార్థ్.
Nagaland firing: 'నాగాలాండ్ కాల్పుల ఘటన పొరపాటు- బాధ్యులపై చర్యలు తీసుకుంటాం'
గతంలో సినిమా టికెట్ట్ ధరలపై హీరో సిద్ధార్థ్ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల తీరుపై తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రశ్నించిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి సిద్దార్థ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తనదైన శైలిలో మండిపడ్డాడు. నాగాలాండ్(Nagaland Incident)లో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో అమాయకపు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో మరో కస్టోడియల్ డెత్(Student custodial death) జరిగింది. ఈసారి స్టూడెంట్ ను బలి తీసుకున్నారు. జవాబుదారీతనం ఎక్కడుంది ? కాపాడాల్సిన వారే ఇలాంటివి చేస్తుంటే ఇంకెలా? అంటూ సిద్ధార్థ్ ప్రశ్నిస్తూ..ట్వీట్ చేశాడు.
Innocent civilians murdered in cold blood by the armed forces in #Nagaland...another custodial death by #police in #TamilNadu this time a student.
Where is the accountability? Why is so much apathy seen in our supposed protectors?
— Siddharth (@Actor_Siddharth) December 6, 2021
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి