SA vs IND 1st T20 Dream11 Team Tips: సఫారీతో నేడే తొలి పోరు.. లైవ్ స్ట్రీమింగ్, డ్రీమ్11 టీమ్ టిప్స్ మీ కోసం..

South Africa Vs India Dream11 team and Playing 11: సౌతాఫ్రికాతో నేటి నుంచి టీమిండియా నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ మ్యాచ్‌కు డ్రీమ్11 టీమ్‌ను ఎలా ఎంచుకోవాలి..? పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్11, పిచ్ రిపోర్ట్ వివరాలు మీ కోసం..  

Written by - Ashok Krindinti | Last Updated : Nov 8, 2024, 02:49 PM IST
SA vs IND 1st T20 Dream11 Team Tips: సఫారీతో నేడే తొలి పోరు.. లైవ్ స్ట్రీమింగ్, డ్రీమ్11 టీమ్ టిప్స్ మీ కోసం..

South Africa Vs India Dream11 team and Playing 11: న్యూజిలాండ్‌లో టెస్ట్ సిరీస్‌ 0-3 తేడా ఓడిపోయిన భారత్.. ఆ ఓటమి నుంచి బాధ నుంచి తెరుకునేందుకు సిద్ధమవుతోంది. నేటి నుంచి సౌతాఫ్రికాతో నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్‌లో తలపడనుంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోనే టీమిండియా.. దక్షిణాఫ్రికాకు చేరుకుని ముమ్మరంగా ప్రాక్టీస్ చేసింది. డర్బన్‌లోని కింగ్స్‌మీడ్ క్రికెట్ గ్రౌండ్‌ వేదికగా రాత్రి 8:30 గంటల నుంచి మ్యాచ్‌ ప్రారంభమవుతుంది. టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్ చేతిలో ఓడిపోయిన సఫారీ.. ప్రతీకారం తీర్చుకునేందుకు రెడీగా ఉంది. అయితే గత ఐదు టీ20 మ్యాచ్‌ల్లో నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోవడం ప్రొటీస్ ఫ్యాన్స్‌ను కలవరపాటుకు గురిచేస్తోంది. ఇక టీమిండియా ఈ ఏడాది 22 టీ20 మ్యాచ్‌లు ఆడగా.. 21 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. సూర్యకుమార్ యాదవ్‌ నాయకత్వంలో ఒక్క ఓటమి కూడా ఎదురవ్వలేదు. శ్రీలంక, బంగ్లాదేశ్‌లపై సిరీస్‌లను క్లీన్‌స్వీప్ చేసింది. భారత్ బలంగా కనిపిస్తున్నా.. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాను ఓడించడం అంత ఈజీ కాదు.

Also Read: Bandi Sanjay Vs KTR: బిడ్డా.. కేటీఆర్ నీ పొగరు దించుతా.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి..  

పిచ్ రిపోర్ట్ ఇలా..

డర్బన్‌లోని కింగ్స్‌మీడ్ క్రికెట్ స్టేడియం పిచ్ ఫాస్ట్ బౌలర్లకు స్వర్గధామం. ఈ పిచ్‌పై పరుగుల కోసం బ్యాట్స్‌మెన్ కష్టడాల్సిందే. టీ20ల్లో ఇక్కడ మొదటి ఇన్నింగ్స్ సగటు  136 రన్స్ మాత్రమే. టాస్ గెలిచిన కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి. మ్యాచ్ సమయంలో స్టేడియం చుట్టూ వర్షం పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. హెడ్ టు హెడ్ రికార్డుల విషయానికి వస్తే.. మొత్తం 27 మ్యాచ్‌ల్లో తలపడగా.. భారత్ 15 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. సౌతాఫ్రికా 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. స్పోర్ట్స్ 18 నెట్‌వర్క్, జియో సినిమా యాప్‌‌లో మ్యాచ్‌ను లైవ్‌లో చూడొచ్చు.

తుది జట్లు ఇలా (అంచనా) SA vs IND Playing11: 

భారత్: అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్థిక్ పాండ్యా, రింకూ సింగ్, రమణదీప్ సింగ్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, యశ్ ధయాల్.  

దక్షిణాఫ్రికా: ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), రీజా హెండ్రిక్స్, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, డోనోవన్ ఫెరీరా, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, ఒట్నీల్ బార్ట్‌మన్, లూథో సిపమ్లా.  

SA vs IND 1st T20I Dream11 Prediction:

==> వికెట్ కీపర్లు: హెన్రిచ్ క్లాసెన్, సంజూ శాంసన్
==> బ్యాటర్స్: సూర్యకుమార్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, రీజా హెండ్రిక్స్, రింకూ సింగ్
==> ఆల్ రౌండర్లు: హార్దిక్ పాండ్యా, మార్కో జాన్సెన్
==> బౌలర్లు: అర్ష్‌దీప్ సింగ్, గెరాల్డ్ కోయెట్జీ, యశ్ ధయాల్

==> కెప్టెన్: సూర్యకుమార్ యాదవ్
==> వైస్ కెప్టెన్: మార్కో జాన్సెన్

Also Read: Iqoo 13 Price: ఫీచర్స్‌ అన్ని అదుర్స్‌.. 50MP ప్రధాన కెమెరాతో iQOO 13 మొబైల్‌ విడుదల..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News