ఆర్కే నగర్ నుండి పోటీచేస్తా: హీరో విశాల్

'స్వతంత్య్ర అభ్యర్థిగా ఆర్కే నగర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా. ఉపఎన్నికల బరిలో ఎందుకు నిలబడవలసి వచ్చిందో.. నామినేషన్ వేసిన తర్వాతే వెల్లడిస్తా' అని చెన్నైలో విశాల్ తెలిపారు.

Last Updated : Dec 3, 2017, 08:26 AM IST
    • ఉపఎన్నికల బరిలో హీరో విశాల్
    • ఎందుకు నిలబడాల్సి వచ్చిందో.. నామినేషన్ అయ్యాక చెబుతా
    • సోమవారం నామినేషన్ దాఖలు
ఆర్కే నగర్ నుండి పోటీచేస్తా: హీరో విశాల్

ప్రముఖ హీరో విశాల్ ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. నామినేషన్ వేసిన తరువాత తాను ఎన్నికల్లో పోటీచేయడానికి గలకారణాలను ప్రకటిస్తానని తెలిపారు. 'స్వతంత్య్ర అభ్యర్థిగా ఆర్కే నగర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా. ఉపఎన్నికల బరిలో ఎందుకు నిలబడవలసి వచ్చిందో.. నామినేషన్ వేసిన తర్వాతే వెల్లడిస్తా' అని చెన్నైలో విశాల్ తెలిపారు. 

విశాల్ సోమావారంనాడు నామినేషన్ వేయనున్నట్టు తెలిసింది. తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లో గెలిచిన తరువాత.. విశాల్ ఇప్పుడిలా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. తమిళ రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన కమల్ హాసన్ హీరో విశాల్ కు మద్దతు ఇవ్వొచ్చని.. ప్రచారం కూడా చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. తమిళ ప్రజలు ప్రత్యామ్నాయంగా మార్పు కోసం విశాల్ కు ఓటు వేసే అవకాశాలు రాజకీయ విశ్లేషకుల భావన. 

Trending News