AR Rahman Mask: మ్యూజిక్ మాయిస్ట్రో ఏఆర్ రెహమాన్ మాస్క్ ధర తెలుసా

AR Rahman Mask: కరోనా మహమ్మారి కట్టడికై పాటించాల్సిన మూడు ముఖ్య సూత్రాల్లో మాస్క్ అతి ముఖ్యమైంది. ఇప్పుడది ముఖానికి ఓ ఆభరణంగా మారింది. అందుకే మార్కెట్లో విభిన్న రకాల మాస్క్‌లు అందుబాటులో వస్తున్నాయి. మరి ఆ సంగీత దర్శకుడు ధరిస్తున్న మాస్క్ ధర ఎంతో తెలుసా..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 9, 2021, 07:35 PM IST
AR Rahman Mask: మ్యూజిక్ మాయిస్ట్రో ఏఆర్ రెహమాన్ మాస్క్ ధర తెలుసా

AR Rahman Mask: కరోనా మహమ్మారి కట్టడికై పాటించాల్సిన మూడు ముఖ్య సూత్రాల్లో మాస్క్ అతి ముఖ్యమైంది. ఇప్పుడది ముఖానికి ఓ ఆభరణంగా మారింది. అందుకే మార్కెట్లో విభిన్న రకాల మాస్క్‌లు అందుబాటులో వస్తున్నాయి. మరి ఆ సంగీత దర్శకుడు ధరిస్తున్న మాస్క్ ధర ఎంతో తెలుసా..

కరోనా మహమ్మారి కట్టడి, వ్యాక్సినేషన్, మాస్క్ ధారణ, పాటించాల్సిన జాగ్రత్తలపై సెలెబ్రిటీలు ఎప్పటికప్పుడు తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా వైరస్ (Corona virus) కట్టడికి పాటించాల్సిన ముఖ్యమైనవాటిలో ఒకటి మాస్క్. మనిషి శరీరంలో ఇప్పుడొక ఆభరణంగా మారిపోయింది ఈ మాస్క్. అందుకే మార్కెట్లో విభిన్న రకాల మాస్క్‌లు అందుబాటులో వచ్చాయి. ఈ తరుణంలో ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ (AR Rahman) ధరిస్తున్న మాస్క్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఈ మాస్క్ ప్రత్యేకత మిని ఎయిర్ ప్యూరిఫయర్( Mini Air purifier). అంటే ఎయిర్‌ను అప్పటికప్పుడు ప్యూరిఫై చేసి లోపలకు పంపిస్తుంది. చూడ్డానికి కూడా కాస్త ఢిఫరెంట్‌గా ఉండటంతో నెటిజన్లు కామెంట్లు ప్రారంభించారు. రెహమాన్ రేంజ్ సెలెబ్రిటీ ఈ మాస్క్ పెట్టుకున్నాడంటే..కాస్ట్ చాలా ఉంటుందని అంచనా వేస్తున్నారు. వాస్తవం కూడా అదే. ఈ మాస్క్ ధర కేవలం 12 వేల రూపాయలు మాత్రమే. అందుకే ఏఆర్ రెహమాన్ మాస్క్(AR Rahman mask Cost) ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Also read: Covid19 Vaccine: కేంద్ర భద్రతా బలగాల ఆధీనంలో భారత్ బయోటెక్ కంపెనీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News