Ladakh Army Truck Accident: లడఖ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. భేరి ప్రాంతంలో ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 9 మంది జవాన్లు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. జవాన్లు కేరే గ్యారిసన్ నుంచి లేహ్ సమీపంలోని క్యారీకి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రం 6.30 గంటలకు ఆర్మీ వాహనం లోయలోకి పడిపోయింది.
లడఖ్ రక్షణ అధికారి మాట్లాడుతూ.. కేరీ పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో వారి వాహనం కాలువలో పడిపోయిందని తెలిపారు. భారత సైన్యానికి చెందిన 9 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. గాయపడిన సైనికులను ఆసుపత్రికి తరటించిన చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. మృతుల్లో ఎనిమిది మంది సైనికులు, ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (JCO) ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ప్రమాదంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ విచారం వ్యక్తం చేశారు. "లడఖ్‌లోని లేహ్ సమీపంలో జరిగిన ప్రమాదంలో భారత ఆర్మీ సిబ్బందిని కోల్పోయినందుకు బాధగా ఉంది. మన దేశానికి వారు అందించిన సేవలను ఎప్పటికీ మరచిపోలేము. నా ఆలోచనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయి. గాయపడిన సిబ్బందిని ఫీల్డ్ ఆసుపత్రికి తరలించారు. వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అని ఆయన ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.
Saddened by the loss of Indian Army personnel due to an accident near Leh in Ladakh. We will never forget their exemplary service to our nation. My thoughts are with the bereaved families. The injured personnel have been rushed to the Field Hospital. Praying for their speedy…
— Rajnath Singh (@rajnathsingh) August 19, 2023
Also Read: Anasuya: వెక్కివెక్కి ఏడ్చిన అనసూయ.. అసలు కారణం ఇదేనా..?
Also Read: Asia Cup 2003: ఈ నెల 21న ఆసియా కప్‌కు టీమిండియా జట్టు ప్రకటన.. ఈ ప్లేయర్లు ఉంటారా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook