కర్ణాటకలో ఘోరం.. పుట్టు వెంట్రుకలకు వెళ్లి వస్తుంటే కార్లు ఢీకొని!

తమ ముద్దుల చిన్నారికి పుట్టు వెంట్రుకలు తీయించడానికి వెళ్లి మంజునాథుడిని దర్శించుకున్నారు. తిరిగి వస్తుంటే దారుణం చోటుచేసుకుంది.

Last Updated : Mar 6, 2020, 11:25 AM IST
కర్ణాటకలో ఘోరం.. పుట్టు వెంట్రుకలకు వెళ్లి వస్తుంటే కార్లు ఢీకొని!

బెంగళూరు: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బెంగళూరు - మంగళూరు జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీకొన్నాయి.  శుక్రవారం వేకువజామున జరిగిన ఈ ప్రమాదంలో 12 మంది మృతిచెందారు. అమరితూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాడ్‌డేరే వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి ఓ కారులో నలుగురు యువకులు ధర్మస్థలికి వెళ్తుండగా వారి వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.

బాలీవుడ్ బ్యూటీతో నాటీగా విజయ్ దేవరకొండ 

ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న టవేరా వాహనాన్ని ఈ కారు ఢీకొనడంతో రెండు వాహనాలు పల్టీలు కొట్టాయి. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు, టవేరాలోని ప్రయాణిస్తున్న తొమ్మిది మంది అక్కడికక్కడే మృతిచెందారు. రెండు ఢీకొన్న కారణంగానే ఎక్కువ మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది. 

తమిళనాడులోని హోసూరుకు చెందిన ఓ ఫ్యామిలీ తొమ్మిది నెలల చిన్నారికి పుట్టు వెంట్రుకలు తీయించడానికి బంధువులతో కలిసి ధర్మస్థలికి వెళ్లింది. మంజునాథస్వామిని దర్శించుకున్న అనంతరం తిరిగి వెళ్తుండగా మరో కారు రూపంలో మృత్యువు వీరిని కబలించింది. దీంతో చిన్నారి సహా 12 మంది చనిపోయారు. ఎదరుగా వచ్చిన కారు వేగంగా దూసుకురావడంతో టవేరా డ్రైవర్ ప్రమాదాన్ని నియంత్రించలేకపోయాడు. 

Also Read: చీఫ్ గెస్ట్‌గా కూతురు అర్హ: అల్లు అర్జున్ ఏమన్నారంటే!

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమైందని, దీని వల్ల ఏ సంబంధంలేని టవేరాలోని ఫ్యామిలీ సైతం ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కునిగల్ హాస్పిటల్‌లో పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు.

అందాల భామ అనన్య లేటెస్ట్ ఫొటోలు

రాహుల్ సిప్లింగంజ్‌పై బీరు సీసాలతో దాడి.. వీడియో వైరల్ 

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News