Encounter: మహారాష్ట్రలో భారీ ఎన్‌కౌంటర్... 8 మంది మావోయిస్టులు మృతి..

Maharashtra encounter : మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా తుపాకుల మోతతో దద్దరిల్లింది. శనివారం తెల్లవారుజామున జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. కూంబింగ్‌కి వెళ్లిన పోలీసులపై మొదట మావోలు కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 13, 2021, 05:31 PM IST
  • మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్
    పోలీసుల కాల్పుల్లో 8 మంది మావోల మృతి
    పోలీసులు-మావోల మధ్య కొనసాగుతున్న కాల్పులు
Encounter: మహారాష్ట్రలో భారీ ఎన్‌కౌంటర్... 8 మంది మావోయిస్టులు మృతి..

Maharashtra Gadchiroli Encounter : మహారాష్ట్రలో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. గడ్చిరోలి జిల్లాలోని కొత్గుల్-గ్యారపట్టి అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. పోలీసులు జరిపిన కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు (Maoists) మృతి చెందారు. మరో 12 మంది మావోయిస్టులు గాయపడినట్లు తెలుస్తోంది. 

శనివారం (నవంబర్ 13) ఉదయం 6.30గం. సమయంలో కాల్పులు మొదలైనట్లు గడ్చిరోలి ఎస్పీ అంకిత్ గోయల్ తెలిపారు. ప్రస్తుతం పోలీసులకు, మావోలకు మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఎన్‌కౌంటర్ (Encounter) జరిగిన ప్రదేశంలో పోలీసులు భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

కొత్గుల్-గ్యారపట్టి ప్రాంతంలో మావోల కదలికలపై పోలీసులకు (Maoists killed in encounter) సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో కూంబింగ్‌కు వెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలో మొదట మావోయిస్టులే తమపై  కాల్పులకు పాల్పడ్డారని... దాంతో తాము ఎదురుకాల్పులకు దిగాల్సి వచ్చిందని పోలీస్ వర్గాలు చెబుతున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Also Read: Shocking News about Sudhir:జబర్దస్త్ కు గుడ్ బై చెప్పిన సుడిగాలి సుధీర్ అండ్ టీమ్..?

గత కొన్నేళ్లుగా మావోయిస్టు పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లతో ఇప్పటికే పార్టీ బలహీనపడిపోయిందన్న వాదన ఉంది. మావోయిస్టు పార్టీ మాత్రం ఇప్పటికీ తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో మావోయిస్టు పార్టీ (Maoists) నాయకత్వం ప్రజా కోర్టు నిర్వహించిన సంగతి తెలిసిందే. అకారణంగా అమాయక ఆదివాసీ,గిరిజనులను హత్య చేశాడనే కారణంతో తమ పార్టీకే చెందిన విజా అనే కమాండర్‌ను మావో నాయకత్వం హత్య చేసింది. ప్రజా కోర్టులోనే అతనికి శిక్ష విధించింది. బీజాపూర్ జిల్లాలోని గంగులూరు-కిరాండుల్ మధ్య అటవీ ప్రాంతంలో ఈ హత్య జరిగింది.  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News