జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలో దాడి మా పనే. .

రెండు రోజుల క్రితం దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలో విద్యార్థులపై జరిగిన దాడి దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ దాడికి సంబంధించి  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దాడి సందర్భంగా ఓ విద్యార్థి తీసిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడా వీడియో ఆధారంగా పోలీసులు దాడికి పాల్పడ్డ వారిని గుర్తించే పనిలో పడ్డారు.

Last Updated : Jan 7, 2020, 04:46 PM IST
జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలో దాడి మా పనే. .

రెండు రోజుల క్రితం దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలో విద్యార్థులపై జరిగిన దాడి దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ దాడికి సంబంధించి  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దాడి సందర్భంగా ఓ విద్యార్థి తీసిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పుడా వీడియో ఆధారంగా పోలీసులు దాడికి పాల్పడ్డ వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఐతే JNUలో దాడి మా పనేనంటూ హిందూ రక్షా  దళ్ ముందుకొచ్చింది. ఆ సంస్థ అధ్యక్షుడు పింకీ చౌదరి ఈ విషయాన్ని వెల్లడించారు.  JNU క్యాంపస్‌లో జాతీయ వాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న కార్యకలాపాలు ఈ మధ్య ఎక్కువయ్యాయని ఆరోపించారు. జాతి వ్యతిరేక విధానాలను హిందూ రక్షా దళ్ ఎప్పటికీ సహించబోదని స్పష్టం చేశారు. అందుకే యూనివర్శిటీలో విద్యార్థులపై దాడులు చేశామన్నారు. తమ హిందూ రక్షా దళ్‌కు చెందిన ప్రతినిధులు JNU క్యాంపస్‌లో దాడి చేశారని తెలిపారు. ఈ దాడికి పూర్తిగా  హిందూ  రక్షా దళ్ బాధ్యత వహిస్తుందని పేర్కొన్నారు.  అంతే కాదు మున్ముందు ఇంకా ఇలాంటి  దాడులు చేస్తామని హెచ్చరించారు.

నిందితులను గుర్తిస్తున్నాం.. 

హిందూ రక్షా  దళ్ కు చెందిన పింకీ చౌదరి చేసిన వ్యాఖ్యలను ఢిల్లీ పోలీసులు  పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో వారిని విచారణ కోసం పిలిపించినట్లు  సమాచారం. మరోవైపు వీడియో  ఫుటేజీలో ఉన్న నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. ముసుగులు వేసుకున్న వారిని గుర్తించేందుకు ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్ ఉపయోగిస్తున్నామని చెప్పారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News