Bengal Violence: హృదయాలను కదిలించే మరో వీడియో.. ఇద్దరు మహిళలను వివస్ర్తలను చేసి దాడి

West Bengal Women Attack Video: మణిపూర్‌ ఘటన మరువముందే పశ్చిమ బెంగాల్‌లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళలను వివస్త్రలను దాడి చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటనపై బీజేపీ, టీఎంసీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.     

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 22, 2023, 04:55 PM IST
Bengal Violence: హృదయాలను కదిలించే మరో వీడియో.. ఇద్దరు మహిళలను వివస్ర్తలను చేసి దాడి

West Bengal Women Attack Video: మణిపూర్‌లో ఇద్దరు మహిళను నగ్నంగా ఊరేగించిన ఘటన ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని మాల్దా జిల్లాలో ఇద్దరు గిరిజన మహిళలను వివస్త్రను చేసి దాడి చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. బమంగోలా వద్ద ఉన్న పాకువా హాట్ (వీక్లీ మార్కెట్)లో ఈ ఘటన జరిగింది. బుధవారం ఈ ఘటన చోటు చేసుకోగా.. ఇందుకు సంబంధించిన వీడియోను బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రాష్ట్రంలోని మహిళలకు భద్రత కల్పించడంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగతనానికి పాల్పడారనే ఆరోపణలతో మహిళలపై స్థానికులు దాడి చేశారని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) క్లారిటీ ఇచ్చింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మాణిక్‌చాక్ ప్రాంతానికి చెందిన ఐదుగురు గిరిజన మహిళలు స్థానిక ఉత్పత్తులను విక్రయించేందుకు మార్కెట్‌కు వచ్చారు. అయితే ఇతర మహిళల వద్ద చోరీలకు పాల్పడుతూ పట్టుబడ్డారు. వారిలో ముగ్గురు తప్పించుకోగా.. ఇద్దరు మహిళలను దొరికిపోయారు. వారిని మార్కెట్‌లోని ఇతర మహిళలు పట్టుకుని చితకొట్టారు. వివస్త్రలను చేసి.. చెప్పులతో దాడి చేశారు. ఓ మహిళా పోలీసు వారిని రక్షించడానికి ప్రయత్నించగా.. ఆమెపై కూడా గుంపు దాడి చేసింది. మహిళలను రక్షించేందుకు స్థానికులు రాలేదని ఆమె ఆరోపించారు.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్‌ను షేర్ చేసిన బీజేపీ ఐటీ సెల్ చీఫ్, పశ్చిమ బెంగాల్‌కు పార్టీ సహ-పరిశీలకుడు అమిత్ మాల్వియా మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్‌లో భయానక పరిస్థితులు కొనసాగుతున్నాయని అన్నారు. మాల్డాలోని బమంగోలా పోలీస్ స్టేషన్‌లోని పకువా హాట్ ప్రాంతంలో ఇద్దరు గిరిజన మహిళలను వివస్త్రను చేసి.. చిత్రహింసలకు గురిచేసి కనికరం లేకుండా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. 

 

ఈ ఘటనపై సీఎం మమతా బెనర్జీ మౌనంగా ఉండడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన మహిళలపై జరిగిన మరో భయంకరమైన సంఘటన ఇది అని అన్నారు. మాల్దాలో ఇద్దరు గిరిజన మహిళలను వివస్త్రను చేసి జాలి లేకుండా కొట్టారని పేర్కొన్నారు. దేశం మొత్తం ఈ సంఘటనను ఎందుకు ఖండించడం లేదని నిలదీశారు. బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ మీడియా సమావేశంలో కన్నీరు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి మహిళ అయినా మౌనంగా ఉన్నారని అన్నారు. న్యాయం కోసం ఎక్కడికి వెళ్లాలో చెప్పాలని అడిగారు. 

వీడియో గురించి రాష్ట్ర మహిళా శిశు ఆరోగ్య శాఖ మంత్రి శశి పంజా మాట్లాడుతూ.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని తెలిపారు. నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ ఘటనకు బీజేపీ అనవసరంగా రాజకీయ రంగు పులుముతోందని ఫైర్ అయ్యారు. మహిళలు వాగ్వాదానికి దిగారని.. అక్కడ ఉన్న పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. గొడవం అనంతరం మహిళలు అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలిపారు.

Also Read: Special Train: గుడ్‌న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. వారి కోసం స్పెషల్ ట్రైన్స్  

Also Read: Snake in Ecil Canteen: క్యాంటీన్ పప్పులో పాము పిల్ల.. భయాందోళనలో ఈవీఎం ఉద్యోగులు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News