BJP Strategy: దక్షిణాది రాష్ట్రాలపై కమలనాథులు దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పుంజుకోవాలని పావులు కదుపుతున్నారు. అగ్ర నేతల టూర్‌తో నేతలు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని చూస్తోంది. త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లోనూ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. దక్షిణాది వ్యక్తికి రాష్ట్రపతి పదవి ఇచ్చి..ఆ గ్రాఫ్ పెంచుకోవాలని బీజేపీ చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై జోరుగా చర్చ జరుగుతోంది.
ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడిని రాష్ట్రపతిగా చేయాలన్న ఆలోచనలో ఆ పార్టీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనకు దక్షిణాదిలో పట్టు ఉంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో వెంకయ్యకు మంచి పేరు ఉంది. ఆయనకు ఇవ్వడం ద్వారా దక్షిణాదిలో పాగా వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీనిపై క్లారిటీ రానున్నట్లు గుసగసలు వినిపిస్తున్నాయి. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ చేసింది. మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని చూస్తోంది. కర్ణాటకలో ప్రస్తుతం బీజేపీ సర్కార్ నడుస్తోంది.
తెలంగాణలోనూ పుంజుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల రాష్ట్రంలో బీజేపీ అగ్ర నేతల తాకిడి పెరిగింది. అమిత్ షా, నడ్డా పలు దఫాలుగా పర్యటిస్తున్నారు. పార్టీ నేతల్లో జోష్ నింపుతున్నారు. త్వరలో వారు మళ్లీ పర్యటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండు దఫాలుగా ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టారు. త్వరలో మరో విడత మొదలయ్యే అవకాశం ఉంది.
ఇటు ఏపీపై కూడా కమలనాథులు ఫోకస్ చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి రాష్ట్రపతి ఇవ్వడం ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ నేతలు సభ్యత్వ నమోదుతో ఇంటింటికి వెళ్తున్నారు. త్వరలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ..ఏపీలో పర్యటించనున్నారు. నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. కర్ణాటకలోనూ మళ్లీ పవర్‌లోకి వచ్చేందుకు పావులు కదుపుతున్నారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పాగా వేసేందుకు స్కెచ్‌లు వేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఎంపీ సీట్లను పెంచుకోవడంతోపాటు ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని యోచిస్తున్నారు. మరి ఆ పార్టీ నేతల వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో..
Also read:Telangana CM Kcr: తెలంగాణ సీఎం కేసీఆర్ మౌనం అందుకేనా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.