Election Campaign on Donkey: అట్లుంటదీ మల్ల.. గాడిద మీద గల్లీ గల్లీ తిరుగుతూ ఎన్నికల ప్రచారం.. వీడియో వైరల్..

Bihar news: ఇండిపెండెంట్ అభ్యర్థి వినూత్నరీతిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాడు. గాడిద మీద గల్లీ గల్లీ తిరుగుతు ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకొవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్  గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : May 19, 2024, 03:30 PM IST
  • గాడిద మీద ఎన్నికల ప్రచారం..
  • గెలిపిస్తే చక్కెర మిల్లు, యూనీవర్సీటీ తెస్తానని హమీ..
Election Campaign on Donkey: అట్లుంటదీ మల్ల.. గాడిద మీద గల్లీ గల్లీ తిరుగుతూ ఎన్నికల ప్రచారం.. వీడియో వైరల్..

Bihar satyendra baitha candidate campaigning on a donkey: దేశంలో ప్రస్తుతం లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక నాయలకు ఓటర్లను ప్రసన్నం చేసుకొవడానికి నానా తంటాలు పడుతుంటారు. కొందరు ఎన్నికల ప్రచారంలో తమ ఓటర్ల కోసం లేని పోనీ పథకాల హమీలు ఇస్తుంటారు. ఇక మరికొన్ని చోట్ల నేతలు.. ఇడ్లీలు వేస్తు, చాయ్ లు చేస్తు ఫోటోలు దిగుతుంటారు. ఓటర్ల ఇంటికి వెళ్లి వారికి ఏదో ఒక పనిచేస్తున్నట్లు చేసి, తమకు ఓటు వేయాల్సిందిగా అభ్యర్థిస్తుంటారు. కొందరు రాజకీయ నాయకులు.. గిన్నెలు కడగటం, చిన్న పిల్లలకు స్నానం చేయించడం, బట్టలు మరత పెట్టడం వంటి ఎన్నో పనులు చేయడం మనం చూశాం. ఇక కొందరైతే మరీ ఎక్కువగా ప్రజలను ప్రసన్నం చేసుకొవడానికి లేనిపోనీ పాట్లు పడుతుంటారు. కొందరు రాజకీయ నాయకులు తమతో తిరిగే కార్యకర్తలకు మందు, డబ్బులు ఇస్తుంటారు. ఎన్నికల్లో నాయకులు బండ్ల మీద, సొంత వాహానాలు, స్పెషల్ వాహానాలలో ప్రచారం నిర్వహిస్తుంటారు.

 

కానీ కొందరు నేతలు ప్రజలకు మంచి చేయాలని ఎన్నికల బరిలో ఉంటారు. కానీ వారి దగ్గర ప్రచారంకు సరిపడా డబ్బులు కూడా ఉండవు. ప్రజలు తమకు సహాయం చేయాలని కోరుతుంటారు. ఇక ఈ మధ్య కాలంలో పెట్రోల్, డీజీల్ ధరలు చుక్కలను తాకుతున్నాయి. ప్రజలు అత్యవసరమైతే తప్ప తమ వాహానాలను అస్సలు బైటకు తీయడం లేదు. ఎన్నికలన్నాక.. వాహానాలు తప్పనిసరి.. నేతలు తమ కార్యకర్తల వాహానాలలో పెట్రోల్ కొట్టింస్తుంటారు. ఇదిలా ఉండగా... బీహార్ కు చెందిన ఒక అభ్యర్థి వెరైటీగా ప్రచారం నిర్వహిస్తున్నాడు. గాడిద మీద గల్లీ గల్లీకి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల మీడియాలో వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు..

బీహర్ లోని గోపాల్ గంజ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. గోపాల్ గంజ్ లోక్ సభ స్థానం నుంచి సత్యేంద్ర బైతా అనే వ్యక్తి ఇండిపెండెంట్ గా బరిలో నిలబడ్డాడు. కానీ ఎన్నికలలో  ప్రజలు ఆకర్శించేందుకు వినూత్నంగా ఆలోచించాడు. అతగాడు..  గాడిదపై ఎక్కి ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నాడు. ఎన్నికలలో, అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించడానికి వివిధ ప్రచార పద్ధతులను ఫాలో అవుతుంటారు. బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో అటువంటి విచిత్రమైన ఎన్నికల ప్రచారం కనిపించింది.  సత్యేంద్ర బైతా అనే అభ్యర్థి గాడిదపై ప్రచారం కోసం బయలుదేరాడు. 

గోపాల్‌గంజ్ లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సత్యేంద్ర బైతా గాడిదపై ఎక్కి ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. అతను గోపాల్‌గంజ్ శ్యాంపూర్ గ్రామానికి చెందినవాడు. తన లోక్‌సభ నామినేషన్‌ పత్రాలను దాఖలు చేసేందుకు గాడిదపై వెళ్లి అందరి దృష్టిని ఆకర్షించారు. అతని అసాధారణ ప్రచార శైలి గురించి కొందరు ఆరా తీశారు. దీనిపై బైతా మాట్లాడుతూ.. పెట్రోల్ , డీజిల్ ధరలు చుక్కలను చూపిస్తున్నాయి.  నాలాంటి చాలా మందికి గిట్టుబాటు కాకపోవడంతో, నేను గాడిద ఎక్కి ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నాను. నా నామినేషన్ పత్రాల దాఖలు కోసం కలెక్టరేట్‌కు చేరుకోవడానికి గాడిదపైన వెళ్లినట్లు తెలిపాడు.

Read more: Viral Video: ఓవరాక్షన్ చేస్తే ఇట్లనే ఉంటది మరీ.. బొక్కొ బొర్లా పడిన యువకుడు.. వీడియో వైరల్..

 బైతా గాడిదపై ఎక్కి అక్కడికి చేరుకున్నప్పుడు చూసేందుకు చాలా మంది తమ ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. ఎన్నికల్లో గెలిస్తే  నియోజకవర్గానికి ఏంచేస్తారని ప్రశ్నించగా.. జిల్లాలో చక్కెర మిల్లును,  విశ్వవిద్యాలయాన్ని తేవాలనుకుంటున్నట్లు చెప్పాడు. పారిశుధ్యం పై కూడా ప్రత్యేంగా టార్గెట్ చేసినట్లు వెల్లడించాడు. గత ఎన్నికల్లో చాలా మంది అభ్యర్థులు గెలిచారు. కానీ. ఎన్నికల్లో గెలిచి ఐదేళ్లుగా జిల్లాలో కనిపించడం లేదు. వారు ఢిల్లీలోనో, పాట్నాలోనో ఉండేవారు. కానీ తాను మాత్రం..  లోకల్ అని.. ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటానని బైతా చెప్పాడు. లోక్‌సభ ఎన్నికల ఆరో దశలో గోపాల్‌గంజ్‌లో మే 25న పోలింగ్ జరగనుంది. ఎన్‌డిఎ అలోక్ కుమార్ సుమన్‌ బరిలో ఉండగా,  ఇండియా బ్లాక్ గోపాల్‌గంజ్ (ఎస్‌సి రిజర్వ్‌డ్) సీటుకు చంచల్ కుమార్ పాశ్వాన్‌ను నామినేట్ చేసింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News