వసతి గృహంలో దారుణం: 34 మందిపై అత్యాచారం!

బీహార్‌లోని షెల్టర్ హోమ్ లో ఉంటున్న దాదాపు 29 మంది బాలికలపై అత్యాచారం చేసిన సంఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

Last Updated : Jul 29, 2018, 02:46 PM IST
వసతి గృహంలో దారుణం: 34 మందిపై అత్యాచారం!

బీహార్‌లోని షెల్టర్‌హోమ్‌లో ఉంటున్న దాదాపు 29 మంది బాలికలపై అత్యాచారం చేసిన సంఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా అత్యాచారానికి గురైన బాలికల కేసులో మరో విస్తుపోయే నిజం వెలుగులోకి వచ్చింది. షెల్టర్ హోమ్‌లో ఉంటున్న 40 మంది బాలికల్లో 29 మంది అత్యాచార బాధితులు ఉన్నట్లు ఇంతకు ముందు తెలిసింది. అయితే, మరో ఐదుగురిపై కూడా అత్యాచారం జరిగినట్లు శనివారం వెలుగు చూసింది.  

బీహార్‌లోని ముజఫర్ పూర్ జిల్లాలోని షెల్టర్ హోమ్‌లో నెలల తరబడి బాలికలపై అత్యాచారాలు జరిగిన విషయం ఇటీవల వెలుగు చూసింది. ఈ కేసులో పోలీసులు 11 మందిని నిందితులుగా గుర్తించి.. వారిలో పది మందిని అరెస్టు చేశారు. ప్రతిపక్షాల ఒత్తిడి మేరకు నితీష్ సర్కార్ ఈ కేసును సీబీఐకి అప్పగించగా.. కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు పదిమందిపై చార్జిషీట్ దాఖలు చేశారు. ముంబయికి చెందిన స్వచ్ఛంద సంస్థ కొద్ది నెలల క్రితం చేసిన తనిఖీలో ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి. ఈ షెల్టర్ హోమ్ ప్రభుత్వ నిధులతో నడుస్తోంది.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొందరు బాలికలు ఈ దారుణ విషయాల గురించి, అక్కడి అకృత్యాల గురించి చెప్పుకొచ్చారు. 'షెల్టర్ హోమ్ సిబ్బంది చిన్నారులను దారుణంగా కొట్టి, వాళ్లు అరవకుండా ఉండేందుకు డ్రగ్స్‌ ఇచ్చేవారు. తిండి కూడా పెట్టకుండా చిత్రవధ చేసేవారు. ఇదేంటని ఎవరైనా ఎదురుతిరిగి మాట్లాడితే.. వాళ్ల దుస్తులు విప్పించి కొట్టడం, సిగరెట్లతో ఒళ్లంతా కాల్చడం చేసే వారు.’ అని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మ్‌పర్సన్‌ దిల్మని మిశ్రా తెలిపారు. ఓ బాలిక వాళ్ల ఆకృత్యాలను వ్యతిరేకించి ప్రాణాలు కోల్పోయినట్లు ఆమె తెలిపారు.

Trending News