Karnataka: భార్య చెప్పిన మాట బుద్దిగా విన్నాడు.. రూ. 25 కోట్లు గెల్చుకున్నాడు.. ఎలాగో తెలుసా..?

Kerala bumper offer: కర్ణాటకకు చెందిన ఒక బైక్ మెకానిక్ ఓవర్ నైట్ లో కోటిశ్వరుడయ్యాడు. ఏకంగా 25 కోట్లు గెల్చుకుని అందర్ని షాక్ కు గురిచేశాడు. ప్రస్తుతం బైక్ మెకానిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు.

Written by - Inamdar Paresh | Last Updated : Oct 11, 2024, 03:59 PM IST
  • ఓవర్ నైట్ లో కోటిశ్వరుడైన బైక్ మెకానిక్..
  • తన లైఫ్ సెటిల్ అంటూ కామెంట్లు..
Karnataka: భార్య చెప్పిన మాట బుద్దిగా విన్నాడు.. రూ. 25 కోట్లు గెల్చుకున్నాడు.. ఎలాగో తెలుసా..?

Bike mechanic althaf won 25 crore lottery in Karnataka: జీవితంలో ఎప్పుడు ఏ విధంగా మారిపోతుందో ఎవరు చెప్పలేరు. కొంత మంది ఓవన్ నైట్ లో కోటీశ్వరులైపోతుంటారు.  తాజాగా, కర్ణాటకలోని  మాండ్య జిల్లా పాండవపురకు చెందిన అల్తాఫ్‌ పాషా అనే బైక్ మెకానిక్ ట్రెండింగ్ గా మారాడు. అతను బైక్ రిపేర్ లు చేస్తు జీవనం సాగిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఇటీవల అతను.. కేరళకు వెళ్లినప్పుడు.. అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓనమ్ బంపర్ లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు.

Add Zee News as a Preferred Source

రూ. 500 పెట్టి రెండు టికెట్లను కొన్నాడు. తాజాగా ప్రకటించిన విజేతల వివరాల్లో అతనికి 25 కోట్ల లాటరీ తగిలింది. దీంతో ఆనందంనలో అల్తాఫా ఫ్యామిలీ ఉబ్బితబ్బైపోతుంది. ఇందులో మొదటి బహుమతి అల్తాఫ్‌ పాషాను వరించింది. అల్తాఫ్‌ పాషా కొన్న టీజీ 43422 నంబర్‌ టికెట్ బంపర్ డ్రాలో మొదటి స్థానంలో నిలిచినట్లు తెలుస్తోంది. దీంతో అల్తాప్ పాషా ఏకంగా రూ.25 కోట్లు గెలుచుకున్నట్లు వయనాడ్‌ జిల్లా పనమారమ్‌లోని లాటరీ నిర్వాహకులు అతడికి ఫోన్‌ చేసి చెప్పారు.

అయితే మొదట అల్తాఫ్ అది వట్టిదే అని నమ్మలేదు. కానీ ఆ తర్వాత నిజమేనని ధ్రువీకరించుకోవడంతో అతని సంతోషానికి అవధుల్లేవని చెప్పవచ్చు.  అయితే.. ఆల్తాఫా తనవద్దఉన్న టికెట్ లను మరోకరికి విక్రయించేందుకు ప్రయత్నించగా అతని భార్య ఒప్పుకోలేదంట. అదే టికెట్ కు రూ. 25 కోట్లు వచ్చాయంట.  మరోవైపు.. అన్నిరకాల కటింగ్ లు పోను.. మొత్తంగా అల్తాఫ్ చేతికి రూ.13 కోట్లు వస్తాయని అధికారులు వెల్లడించారు.

Read more:Viral Video: ప్రేయసీతో మాట్లాడుతూ.. లోకాన్ని మర్చిపోయాడు.. ఇంతలో ఎంట్రీ ఇచ్చిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..

ఆ డబ్బుతో బెంగళూరుకు వెళ్లి స్థిరపడతానని.. తన కుమార్తె పెళ్లి వేడుకగా చేస్తానని.. తనకు ఉన్న అప్పులు మొత్తం తీర్చేస్తానని అల్తాఫ్ పాషా సంతోషంతో చెప్పాడు. ఈ ఘటన మాత్రం ప్రస్తుతం వార్తలలో నిలిచింది. దీంతో నెటిజన్ లు మాత్రం కొంత మంది అందుకు పెళ్లాం మాట వినాలని ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News