Biren Singh Regrets: అశాంతి.. ఘర్షణలు.. తీవ్ర రక్తపాతం సంభవించి పదుల సంఖ్యలో మరణాలు సంభవించడంతో దేశంలో మణిపూర్ రాష్ట్రం అల్లకల్లోలంగా మారింది. దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో సంచలనం రేపిన మణిపూర్ అల్లర్లపై స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ స్పందించారు. చాలా కాలం తర్వాత తన రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక సంఘటనలపై నోరు మెదిపారు. ఈ సందర్భంగా ప్రజలకు క్షమాపణలు కోరారు. 'నన్ను క్షమించండి' అంటూ ప్రకటన చేశారు.
Also Read: New Year Prabhas: న్యూ ఇయర్ వేళ ఫ్యాన్స్‌కు డార్లింగ్ ప్రభాస్ వీడియో సందేశం
'ఈ ఏడాది (2024) మొత్తం చాలా కష్టంగా గడిచిపోయింది. ఎంతో మంది తమ కుటుంబాలను కోల్పోయారు. మరికొందరు వారి ఇళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చింది. 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ విచార పరిస్థితికి నేను ఎంతో బాధపడుతున్నా. మే నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన పరిణామాల పట్ల ప్రజలను క్షమాపణలు కోరుతున్నా' అని సీఎం బీరేన్ సింగ్ ప్రకటన చేశారు. ఈ ఏడాదంతా దురదృష్టకరంగా మారిందని.. అందుకు తనను క్షమించాలని కోరడం సంచలనం రేపింది.
Also Read: Sreeleela Video: తప్పుడు ప్రచారం.. ఫేక్ న్యూస్‌పై శ్రీలీల మాస్ వార్నింగ్
ఇక 2024లో రాష్ట్రంలో జరిగిన పరిణామాలపై సీఎం బీరేన్ సింగ్ మీడియాకు వివరించారు. 'మొత్తం 12 వేలకు పైగా కేసులు నమోదవగా.. 625 మంది అరెస్టయ్యారు. 5,600 ఆయుధాలు, 35 వేల మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. కొన్ని నెలలుగా రాష్ట్రం శాంతి నెలకొంది. మణిపూర్ క్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం భద్రతా సిబ్బందిని పంపింది. నిర్వాసితుల కోసం నిధులు సమకూర్చింది' అని బీరేన్ సింగ్ తెలిపారు. వచ్చే ఏడాది 2025 నుంచి శాంతి నెలకొంటుందని విశ్వసిస్తున్నట్లు ప్రకటించారు.
ఇన్నాళ్లు జరిగిన తప్పిదాలను క్షమించి.. చేదు జ్ఞాపకాలను మరచిపోదాం అని మణిపూర్ ప్రజలకు ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ విజ్ఞప్తి చేశారు. కొత్తగా జీవితాలను ప్రారంభిద్దామని పిలుపునిచ్చారు. అన్ని జాతుల వారు ఐకమత్యంగా జీవించాలని కోరారు. మణిపూర్‌లో కుకీ, మైతేయి తెగల మధ్య ఘర్షణలు చోటుచేసుకుని మణిపూర్ అల్లకల్లోలమైన విషయం తెలిసిందే. ఈ ఘర్షణల్లో 225 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ అక్కడ శాంతియుత పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలోనే 2024లో చోటుచేసుకున్న పరిణామాలపై సీఎం పై ప్రకటన చేశారు.
#WATCH | Imphal: Manipur CM N Biren Singh says "This entire year has been very unfortunate. I feel regret and I want to say sorry to the people of the state for what is happening till today, since last May 3. Many people lost their loved ones. Many people left their homes. I… pic.twitter.com/tvAxInKPdg
— ANI (@ANI) December 31, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook