/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

West Bengal Elections 2021: బెంగాల్ ఎన్నికల పోరు తారాస్థాయికి చేరుకుంటోంది. అధికార టీఎంసీ, బీజేపీ మధ్య నువ్వా నేనా రీతిలో పోటీ సాగుతోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీను ఇరుకున పెట్టేందుకు బీజేపీ సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించింది.

దేశంలో జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నా ప్రధానంగా అందరి దృష్టి పడింది మాత్రం పశ్చిమ బెంగాల్ ఎన్నికల(West Bengal Assembly Elections)పైనే. బెంగాల్ పీఠంపై ముచ్చటగా మూడోసారి కూర్చోడానికి దీదీ మమతా బెనర్జీ ప్రయత్నిస్తుంటే.బెంగాల్ పీఠంపై కాషాయజెండా ఎగురవేసేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దసంఖ్యలో కీలకనేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. టీఎంసీ(TMC)లో కీలకంగా ఉన్న సీనియర్ నేత సువేందు అధికారి సైతం బీజేపీలో చేరిపోయారు. బీజేపీ ఇప్పుడు 57 మంది అభ్యర్ధులతో తొలి జాబితాను విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee)ని ఇరుకునపెట్టేందుకు కొత్త అస్త్రాన్ని సంధించింది.

మమతా బెనర్జీ బరిలో ఉన్న నందిగ్రామ్‌లో ఆమెకు పోటీగా ...నిన్న మొన్నటివరకూ ఆమెకు సన్నిహితుడిగా ఉన్న పార్టీలో సీనియర్ నేత, ఇటీవల బీజేపీ(BJP) తీర్ధం పుచ్చుకున్న నందిగ్రామ్ సిట్టింగ్ ఎమ్మెల్యే సువేందు అధికారి అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేసింది. 2011లో ఉవ్వెత్తున ఎగసిన నిరసనలతో మమతా బెనర్జీ అధికారంలో వచ్చేందుకు కారణమైన నందిగ్రామ్ (Nandigram) ఈసారి ఎన్నికల్లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. దీనికి కారణం ఇప్పుడిక్కడ పోటీ మమతా వర్సెస్ సువేందు అధికారి కావడమే. సువేందు అధికారి(Suvendu Adhikari)కి స్థానికంగా పట్టుండటంతో పోటీ కీలకంగా మారింది. మరోవైపు మాజీ క్రికెటర్ అశోక్ దిందా, మాజీ ఐపీఎస్ అధికారి భారతి ఘోష్‌లకు తొలి జాబితాలో  స్థానం కల్పించింది బీజేపీ. ఒక స్థానాన్ని మాత్రం మిత్రపక్షం ఏజేఎస్‌యూకి కేటాయించారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు మార్చ్ 27 నుంచి 29 వరకూ 8 దశల్లో జరగనున్నాయి. ప్రస్తుతం బీజేపీ విడుదల చేసిన తొలి జాబితాలో మొదటి రెండు విడతలు ఎన్నికలు జరిగే 60 స్థానాలున్నాయి. 

Also read: Tamil Nadu Assembly Elections 2021: డీఎంకే, కాంగ్రెస్ సీట్ల సర్దుబాటుపై కీలక నిర్ణయం, మరో కొత్త సీటు ఆఫర్ ఇచ్చిన DMK

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Bjp fields suvendu adhikari against cm mamata banerjee in nandigram constituency
News Source: 
Home Title: 

West Bengal Elections 2021: నందిగ్రామ్‌లో మమతా బెనర్జీకు పోటీగా సువేందు అధికారి

West Bengal Elections 2021: నందిగ్రామ్‌లో మమతా బెనర్జీకు పోటీగా సువేందు అధికారి
Caption: 
Mamata and suvendu (file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

57 మందితో పశ్చిమ బెంగాల్ ఎన్నికల తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ

నందిగ్రామ్ నుంచి మమతా బెనర్జీపై పోటీగా టీఎంసీ మాజీ నేత సువేందు అధికారిని ప్రకటించిన బీజేపీ

నందిగ్రామ్ సిట్టింగ్ ఎమ్మెల్యే సువేందు అధికారినే

Mobile Title: 
West Bengal Elections 2021: నందిగ్రామ్‌లో మమతా బెనర్జీకు పోటీగా సువేందు అధికారి
Publish Later: 
No
Publish At: 
Sunday, March 7, 2021 - 12:03
Reported By: 
Md. Abdul Rehaman
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
47
Is Breaking News: 
No