జర్మనీకి చెందిన బీఎండబ్ల్యూ కార్ల కంపెనీ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఖరీదైన లగ్జరీ కార్లలో పెద్దన్నగా పేరున్న బీఎండబ్ల్యూ గ్రూప్‌కి చెందిన బీఎండబ్ల్యూ మోటారాడ్ తాజాగా రెండు కొత్త మోడల్ బైక్స్‌ను ఇండియాలో ప్రవేశపెట్టింది. అందులో ఒకటి F750 GS మోడల్ బైక్ కాగా మరొకటి F850 GS మోడల్ బైక్. ఈ రెండు బైక్స్ ఎక్స్‌షోరూం ఖరీదు రూ. 11.95 లక్షల నుంచి రూ. 14.4 లక్షలుగా ఉన్నట్టు ఈ రెండు బైక్స్‌ను ఇండియాలో ప్రవేశపెట్టిన బీఎండబ్ల్యూ మోటారాడ్ ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది. బీఎండబ్ల్యూ మోటారాడ్ డీలర్‌షిప్స్ నుంచి ఈ బైక్స్‌ను బుక్ చేసుకోవచ్చని ఈ సందర్భంగా కంపెనీ స్పష్టంచేసింది.
BMW F750 GS మోడల్ బైక్స్‌లో మూడు రకాల బైక్స్ ఉండగా వాటి ధరలు రూ.11.95 లక్షల నుంచి రూ.13.4 లక్షల వరకు ఉన్నాయి. ఇక అదేవిధంగా BMW F850 GS మోడల్ బైక్స్ లోనూ మొత్తం మూడు వేరియంట్స్ ఉండగా వాటి ధరలు రూ.12.95 లక్షల నుంచి రూ. 14.4 లక్షల వరకు ఉన్నాయి.
850 సీసీ కెపాసిటీ కలిగిన ఈ రెండు మోడల్స్‌లోనూ శక్తివంతమైన 2 సిలిండర్ ఇంజన్ అమర్చారు. మెరుగైన సురక్షితమైన ప్రయాణం కోసం ఆటోమేటిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఏఎస్‌సీ) సిస్టం సైతం కలిగి ఉండటం ఈ బైక్స్ ప్రత్యేకతగా కంపెనీ తెలిపింది.