Arnab Goswamy: బెయిల్ పిటీషన్ రద్దు చేసిన బాంబే హైకోర్టు

రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నబ్ గోస్వామికి చుక్కెదురైంది. అర్నబ్ బెయిల్ పిటీషన్‌ను బాంబే హైకోర్టు కొట్టివేసింది. ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, అతని తల్లి కుముద్ నాయక్ ఆత్మహత్య వ్యవహారంలో అర్నబ్ అరెస్టయ్యారు.

Last Updated : Nov 9, 2020, 04:51 PM IST
Arnab Goswamy: బెయిల్ పిటీషన్ రద్దు చేసిన బాంబే హైకోర్టు

రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నబ్ గోస్వామి ( Republic tv Editor Arnab Goswamy )కి చుక్కెదురైంది. అర్నబ్ ( Arnab ) బెయిల్ పిటీషన్‌ను బాంబే హైకోర్టు కొట్టివేసింది. ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, అతని తల్లి కుముద్ నాయక్ ఆత్మహత్య వ్యవహారంలో అర్నబ్ అరెస్టయ్యారు.

రిపబ్లికన్ టీవీ ( Republican Tv ) ఎడిటర్ 5 కోట్లు ఇవ్వకుండా వేధించారని ఆరోపిస్తూ..ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్ , అతని తల్లి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసులో అర్నబ్ గోస్వామి ( Arnab Goswamy ) తో పాటు మరో ఇద్దరు నిందితుల్ని ఈ నెల 4 వతేదీన రాయ్‌గఢ్ పోలీసులు అరెస్టు చేశారు. బెయిల్ కోసం బాంబే హైకోర్టులో అర్నబ్ దాఖలు చేసుకున్న పిటీషన్‌ను బాంబే హైకోర్టు ( Bombay Highcourt ) కొట్టివేసింది.

అసాధారణ అధికారాల కేసు ఏదీ నమోదు కాలేదని..రెగ్యులర్ బెయిల్ కోసం సెషన్స్ కోర్టుకు దరఖాస్తు చేసుకోవాలని బాంబే హైకోర్టు న్యాయమూర్తులు ఎస్ఎస్ షిండే, ఎంఎస్ కార్ణిక్ స్పష్టం చేశారు. ఒకవేళ సెషన్స్ కోర్టుకు బెయిల్ పిటీషన్ దాఖలు చేసుకుంటే 4 రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. ఇంతకుముందు బెయిల్ పిటీషన్‌ పై రోజంతా వాదనలు సాగాయి అయితే తీర్పును ఇవాళ్టికి వాయిదా వేసింది కోర్టు. అర్నబ్‌తో పాటు మరో ఇద్దరు నిందితులు అక్రమ అరెస్టును సవాలు చేస్తూ..బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేశారు. సెషన్స్ కోర్టుకు బెయిల్ కోసం వెళ్లడానికి నిందితులకు ఎటువంటి ఆంక్షలు లేవని బాంబే హైకోర్టు తెలిపింది. 

అర్నబ్‌ను అరెస్టు చేయడానికి ముందు అతని పట్ల మహారాష్ట్ర ప్రభుత్వం (Maharashtra Government )వ్యవహరించిన  తీరుపై‌ దర్యాప్తు జరిపించాలని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ( Devendra Fudnavis ) డిమాండ్ చేశారు. మరోవైపు అర్నబ్ ఆరోగ్యం, రక్షణ విషయంలో  మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింహ్ కోశ్యారీ రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌తో మాట్లాడి తెలుసుకున్నారు. అర్నబ్ కుటుంబాన్ని కలిసేందుకు అనుమతివ్వాలని హోంమంత్రికి గవర్నర్ సూచించారు. 

ముంబాయిలోని లోయర్ పరేల్ నివాసంలో అర్నబ్‌ను అరెస్టు చేసిన పోలీసులు అలిబాగ్‌కు తీసుకెళ్లారు. అక్కడి మెజిస్ట్రేట్ అర్నబ్ సహా ముగ్గురు నిందితులకు నవంబర్ 18 వరకూ జ్యుడీషయిల్ రిమాండ్  విధించారు. Also read: ICMR Recruitment 2020: ఉద్యోగాల భర్తీకి ఐసీఎంఆర్‌ నోటిఫికేషన్‌

Trending News