Budget 2023: ఆఫ్ఘనిస్తాన్‌కి భారత్ నుంచి రూ. 200 కోట్లు నిధులు.. స్పందించిన తాలిబన్లు

Budget 2023: ఆఫ్గనిస్థాన్ పార్లమెంట్ నిర్మాణం, అలాగే హేరత్ ప్రావిన్సులోని ఇండియా - ఆఫ్గనిస్థాన్ ఫ్రెండ్‌షిప్ డ్యామ్ నిర్మాణం బాధ్యత భారత ప్రభుత్వానిదే అని సుహైల్ షాహీన్ గుర్తుచేశారు. ఆఫ్గనిస్తాన్‌లో తాలిబాన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత వరుసగా రెండో ఏడాది కూడా భారత ప్రభుత్వం ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వానికి అండగా నిలబడటం గొప్ప విషయం అని కొనియాడారు.

Written by - Pavan | Last Updated : Feb 2, 2023, 06:43 PM IST
Budget 2023: ఆఫ్ఘనిస్తాన్‌కి భారత్ నుంచి రూ. 200 కోట్లు నిధులు.. స్పందించిన తాలిబన్లు

Budget 2023: కేంద్రం నిన్న బుధవారం ప్రకటించిన బడ్జెట్‌లో విదేశాంగ మంత్రిత్వ శాఖ కోసం రూ. 18,050 కోట్లు కేటాయించగా అందులో రూ. 200 కోట్లు ఆఫ్ఘనిస్థాన్ అభివృద్ధి కోసం కేటాయించింది. ఆఫ్ఘనిస్థాన్ అభివృద్ధి కోసం ఇండియన్ గవర్నమెంట్ రూ. 200 కోట్లు కేటాయించడంపై తాలిబన్లు స్పందించారు. తమ దేశం అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం నిధులు కేటాయించడం గొప్ప విషయమని.. ఇరు దేశాల మధ్య పరస్పర సంబంధాల కోసం కృషి చేస్తామని తాలిబన్లు ప్రకటించారు. తాలిబన్ల నేత సుహైల్ షాహీన్ జీ మీడియాతో మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇండియా - ఆఫ్గనిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడేందుకు దోహదపడుతుంది అని అన్నారు.

ఆప్ఘానిస్తాన్‌లో భారత సర్కారు నిధులతో పలు ప్రాజెక్టులు నిర్మితమవుతున్నాయని.. భారత్ ఆ ప్రాజెక్టుల పని పునఃప్రారంభిస్తే రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని సుహైల్ షాహీన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆఫ్దనిస్థాన్ లో ప్రజలు తీవ్రమైన పేదరికం, నిరుద్యోగం సమస్యతో బాధపడుతున్నారని.. దేశాన్ని గాడిలో పెట్టడం కోసం ఇంతకు ముందెప్పుడూ లేనంత స్థాయిలో కృషి చేయాల్సిన అవసరం ఉందని సుహైల్ షాహీన్ స్పష్టంచేశారు. 

ఆఫ్గనిస్థాన్ పార్లమెంట్ నిర్మాణం, అలాగే హేరత్ ప్రావిన్సులోని ఇండియా - ఆఫ్గనిస్థాన్ ఫ్రెండ్‌షిప్ డ్యామ్ నిర్మాణం బాధ్యత భారత ప్రభుత్వానిదే అని సుహైల్ షాహీన్ గుర్తుచేశారు. ఆఫ్గనిస్తాన్‌లో తాలిబాన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత వరుసగా రెండో ఏడాది కూడా భారత ప్రభుత్వం ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వానికి అండగా నిలబడటం గొప్ప విషయం అని కొనియాడారు. 

ఇదిలావుంటే, భారత సర్కారు సైతం ఆఫ్ఘనిస్థాన్‌తో తమకు ఉన్న చిరకాల బంధాన్ని అనేక సందర్భాల్లో గుర్తుచేసుకున్న సంగతి తెలిసిందే. ఆప్ఘనిస్థాన్‌లో ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ఆ దేశ ప్రభుత్వానికి తోడుగా నిలిచే క్రమంలో గోధుమలు, వ్యాక్సిన్లతో కూడిన కన్‌సైన్‌మెంట్స్‌ని పంపించిన సందర్భాలు ఉన్నాయి. మరోవైపు విదేశాంగ మంత్రిత్వ శాఖ కోసం భారత సర్కారు కేటాయించే నిధులను గతేడాది కంటే ఈ ఏడాది 4.64 శాతం పెంచారు. గతేడాది రూ. 17,250 కోట్లు కేటాయించగా.. ఈ ఏడాది రూ. 18050 కోట్లు కేటాయించారు. ఇందులో వివిధ దేశాల అభివృద్ధి కోసం రూ.5,408 కోట్లు కేటాయించగా .. G20 అధ్యక్ష బాధ్యతల నిర్వహణ కోసం రూ. 990 కోట్లు కేటాయించారు.

ఇది కూడా చదవండి : Budget 2023: మొట్టమొదటి బడ్జెట్ ఎవరు ప్రవేశపెట్టారు ? ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన నేత ఎవరు ?

ఇది కూడా చదవండి : Budget 2023: అమృత్ కాల్ అంటే ఏంటి ? బడ్జెట్ స్పీచ్‌లో ఆ పదం పదేపదే ఎందుకు ఉపయోగించారు

ఇది కూడా చదవండి : Budget 2023: కేంద్రం ఇచ్చేది 6 శాతం తీసుకునేది 12 శాతం.. ఏంటో తెలుసా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News