ఢిల్లీ లిక్కర్ కేసు దేశంలో ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఈ కేసు రాజకీయంగా అలజడి సృష్టిస్తోంది. ఈ కేసులో తొలి ఛార్జిషీటును సీబీఐ ఇవాళ దాఖలు చేసింది.
దేశంలో సంచలనం రేపిన ఢిల్లీ మద్యం కేసులో సీబీఐ తొలి ఛార్జిషీటు దాఖలు చేసింది. ఏకంగా 10 వేల పేజీల ఛార్జిషీటు ఇది. ఈ కేసులో నిందితులైన హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్ మహేంద్రుడు అరుణ్ రామచంద్ర పిళ్లై, ముఠా గౌతంలతో పాటు ఎక్స్చైజ్ శాఖ డిప్యూటీ కమీషనర్ కుల్‌దీప్ సింగ్, ఎక్స్చైజ్ శాఖ అసిస్టెంట్ కమీషనర్ నరేంద్ర సింగ్ పేర్లు ఈ తొలి ఛార్జిషీటులో ఉన్నాయి. ఈ కేసులో మొదటి అరెస్టు నుంచి 60 రోజుల్లోగా ఛార్జిషీటు దాఖలు చేయాలి. ఆ గడువు ఇవాళ అంటే నవంబర్ 25తో ముగుస్తుండటంతో..ట్రయల్ కోర్టులో సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది.
సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీటులో ఏ1 కుల్‌దీప్ సింగ్, ఏ2 నరేంద్ర సింగ్, ఏ3 విజయ్ నాయర్, ఏ4 అభిషేక్ బోయినపల్లి ఉన్నారు. ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు విచారణను ఈ నెల 30వ తేదీకు వాయిదా వేసింది. సీబీఐ దాఖలు చేసిన తొలి ఛార్జిషీటుపై అదే రోజు ట్రయల్ కోర్టు నిర్ణయం తీసుకోనుంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సాక్షులిచ్చిన సమాచారం, ఆధారాల్ని కూడా సీబీఐ ఛార్జిషీటుకు అనుబంధంగా సమర్పించింది. సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిన వస్తువుల నివేదిక ఇంకా రావల్సి ఉందని సీబీఐ కోర్టుకు తెలిపింది. ఈ కేసులో ఇప్పటి వరకూ విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లిని మాత్రమే సీబీఐ అరెస్టు చేసింది. ఈ కేసులో ఈడీ మరో రెండ్రోజుల్లో ఛార్జిషీటు దాఖలు చేయనుంది.
Also read: Baba Ramdev: నా కంటికి మహిళలు ఏం ధరించకపోయినా బాగుంటారు- బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook