న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుండడంతో విద్యా వ్యవస్థపై నీలినీడలు కమ్ముకున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ అధికమవుతుండడంతో ఈ విద్యా సంవత్సరంపై సందేహాలు ముసురుకుంటున్నాయి. కరోనా రోజుకో రూపం మార్చుతుండడంతో అటు రాష్ట్ర ప్రభుత్వాలు, ఇటు కేంద్రం దిక్కు తోచని స్థితిలో పడిపోయాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు విద్యార్థులపై అధిక భారం పడకుండా సిలబస్ తగ్గిస్తున్నాయి. సమయభావాన్ని దృష్టిలో ఉంచుకొని తాజాగా సీబీఎస్ఈ కూడా 30 శాతం సిలబస్ తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. 9 నుంచి 12వ తరగతి వరకు సిలబస్ ను కుదిస్తున్నామని అధికారికంగా ఓ ప్రకటనలో బోర్డు వెల్లడించింది. RGV సెక్సీ హీరోయిన్ Apsara Rani హాట్ ఫొటోలు వైరల్
Also Read: ‘మోదీజీ 21 రోజులు చాలన్నారు.. 110 రోజులైంది’
కాగా ఈ నిర్ణయం 2020-21 విద్యా సంవత్సరానికి వర్తిస్తుందని పేర్కొంది. కరోనా పరిస్థితుల కారణంగా విద్యార్థులు నష్టపోయిన కాలం ఈ నిర్ణయం ద్వారా భర్తీ అవుతుందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వెల్లడించారు. అయితే సిలబస్ కీలక పాఠ్యాంశాల జోలికి వెళ్లబోవడంలేదని స్పష్టం చేశారు. ఇకముందు ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేసి నిర్ణయాలు తీసుకుంటామని బోర్డు వెల్లడించింది.
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos