CGHS Scheme Benefits: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు లభించే సీజీహెచ్ఎస్ ప్రయోజనాలు

CGHS Scheme Benefits: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. ప్రభుత్వం అందిస్తున్న హెల్త్ స్కీమ్ లబ్దిదారులకు మరింత అదనపు ప్రయోజనం కలగనుంది. ఈ పధకానికి ఎవరు అర్హులు, ఏయే సేవలు అందుబాటులో ఉన్నాయనే వివరాలు తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 3, 2024, 12:20 PM IST
CGHS Scheme Benefits: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు లభించే సీజీహెచ్ఎస్ ప్రయోజనాలు

CGHS Scheme Benefits: సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వర్తిస్తుంది. ఈ పధకాన్ని స్థూలంగా CGHS అని కూడా పిలుస్తారు. ఈ పథకంలో ఎలాంటి సేవలు పొందవచ్చు, అర్హులెవరు వంటి వివరాలు మీ కోసం.

CGHS వివరంగా చెప్పాలంటే Central Government Health Scheme అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, మాజీ ఉద్యోగులు అంటే పెన్షనర్లకు వర్తిస్తుంది. ఈ పధకం లబ్ది పొందేందుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కొన్ని మార్గదర్శకాలున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబీకులు ఈ పధకం లబ్ది పొందవచ్చు. ఈ పధకం దేశంలోని 80 నగరాల్లో అందుబాటులో ఉంది. ఈ నగరాల్లో నివసించేవారు ఈ పధకం ప్రయోజనాలు పొందవచ్చు. 

CGHS పధకం అందుబాటులో ఉన్న నగరాలు

ఆగ్రా, అగర్తల, అహ్మదాబాద్, ఐజ్వాల్, అజ్మీర్, అలీగడ్, అల్లహాబాద్, అంబాల, అమృతసర్, బెంగళూరు, బరేలి, బర్హంపూర్, భోపాల్, భువనేశ్వర్, చంద్రపూర్, చండీగఢ్, శంభాజీ నగర్, చెన్నై, ఛాప్రా, కోయంబత్తూరు, కటక్, దర్భంగా, ధనబాద్, డెహ్రాడూన్, ఢిల్లీ ఎన్‌సీఆర్, గాంధీనగర్, గ్యాంగ్‌టక్, వెంట్, గోరఖ్‌పూర్,  గౌహతి, గుంటూరు, గ్వాలియర్, హైదరాబాద్, ఇంఫాల్, ఇండోర్, జబల్పూర్, జైపూర్, జమ్ము, జలంధర్, జోధ్‌పూర్, కాన్పూర్, కోహిమ, కొచ్చి, కోటా, కోజికోడ్, లక్నో, మీరట్, మురాదాబాద్, ముంబై, ముజఫర్ పూర్, నాసిక్, మైసూరు, నాగపూర్, నెల్లూరు, పాణాజి, పాట్నా, పంచకుల, పుదుచ్చేరి, పూణే, రాయ్‌పూర్, రాంచి, రాజమండ్రి, సహ్రాన్ పూర్, షిల్లాంగ్, షిమ్లా, సిల్చార్, సిలిగురి, శ్రీనగర్, తిరువనంతపురం, సోనేపట్, తిరుచిరాపల్లి, తిరునల్వేలి, వడోదర, వారణాసి, విజయవాడ, విశాఖపట్నం

ఎయిమ్స్ ఆసుపత్రుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు మాజీ ఎంపీలు, మాజీ గవర్నర్లు, మాజీ న్యాయమూర్తులు, స్వాతంత్య్ర సమరయోదులు నగదు రహిత చికిత్స పొందవచ్చు. సీజీహెచ్‌ఎస్ లబ్దిదారులకు ఎయిమ్స్ ఆసుపత్రుల్లో ప్రత్యేక డెస్క్ ఏర్పాటై ఉంటుంది. ఆసుపత్రిలో చేరేముందు ఆ డెస్క్‌లో వెరిఫికేషన్ కోసం కార్డు సమర్పించాల్సి ఉంటుంది. కార్డు హోల్డర్ కుటుంబంలో వ్యక్తికి చికిత్స కోసమైతే ఆ కార్డు కాపీని సమర్పించాలి

Also read; AP Railway Projects: ఎన్నికల వేళ ఏపీ రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధుల కేటాయింపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News