Vaccine Distribution: కోట్లాది వ్యాక్సిన్ డోసులకు కోల్డ్ స్టోరేజ్ ఎలా? స్విగ్గీ, జొమాటోల ద్వారా పంపిణీ?

కరోనా వైరస్ కట్టడికి వ్యాక్సిన్ తయారీ అనంతరం మరో పెద్ద సవాలు ఎదురుకానుంది. వ్యాక్సిన్ స్టోరేజ్, పంపిణీ అతిపెద్ద సమస్యగా మారనుంది. ఈ సమస్యను అధిగమించడానికి కేంద్రం వివిధ రకాలుగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Last Updated : Oct 9, 2020, 11:23 AM IST
  • కరోనా వ్యాక్సిన్ పంపిణీకు కోల్డ్ స్టోరేజ్ పాయింట్ల గుర్తింపు ప్రారంభం
  • అక్టోబర్ 15 నాటికి వ్యాక్సిన్ పంపిణీపై ముసాయిదా సిద్ధం
  • స్విగ్గీ, జొమాటోల ద్వారా పంపిణీకు ఆలోచన
Vaccine Distribution: కోట్లాది వ్యాక్సిన్ డోసులకు కోల్డ్ స్టోరేజ్ ఎలా? స్విగ్గీ, జొమాటోల ద్వారా పంపిణీ?

కరోనా వైరస్ ( Corona virus ) కట్టడికి వ్యాక్సిన్ తయారీ అనంతరం మరో పెద్ద సవాలు ఎదురుకానుంది. వ్యాక్సిన్ స్టోరేజ్ ( Vaccine Storage ) , పంపిణీ ( Distribution ) అతిపెద్ద సమస్యగా మారనుంది. ఈ సమస్యను అధిగమించడానికి కేంద్రం వివిధ రకాలుగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కారమార్గంగా ఉంది. ప్రస్తుతం వివిధ కంపెనీల వ్యాక్సిన్ లు మూడోదశ ప్రయోగాల్లో ఉన్నాయి. రష్యా ఇప్పటికే వ్యాక్సిన్ ( Russian corona vaccine ) తయారీ ప్రారంభించి పంపిణీకు సిద్ధమౌతోంది. ఈ నేపధ్యంలో వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన తరువాత ఆ వ్యాక్సిన్ ను స్టోరేజ్ చేయడం, పంపిణీ చేయడమనేది అతిపెద్ద సవాలుగా మారనుంది.

కరోనా వ్యాక్సిన్ మరి కొద్దినెలల్లో ఇండియా ( India ) లో అందుబాటులో రావచ్చనే అంచనాలున్నాయి. ఈ నేపధ్యంలో వ్యాక్సిన్ పంపిణీకు కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. వ్యాక్సిన్ డోసుల్ని స్టోర్ చేయడానికి దేశవ్యాప్తంగా కోల్డ్‌ స్టోరేజీ యూనిట్లు ( Cold Storage units ) ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించే పనిలో పడింది. దీనికి సంబంధించి జాతీయ నిపుణుల కమిటీ ఫార్మాసూటికల్, ఆహార రంగాలలో ఉన్న కంపెనీలతో సంప్రదింపులు జరుపుతోంది. స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్‌ డెలివరీ స్టార్టప్‌లతో ఒప్పందాలు కుదర్చుకొని తాలూకా స్థాయిలో వ్యాక్సిన్‌ పంపిణీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

వ్యాక్సిన్ డోసుల పంపిణీకి సంబంధించి ఒక ముసాయిదా ప్రణాళికను వచ్చేవారంలో విడుదల చేయనున్నట్టుగా ఆ వర్గాలు తెలిపాయి. భారత్‌ తాను సొంతంగా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌తో పాటు 3 విదేశీ వ్యాక్సిన్లు మరి కొద్ది నెలల్లో అందుబాటులోకి రావచ్చనేది అంచనా. సాధారణంగా వ్యాక్సిన్ స్టోర్ చేయడానికి 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండాలి. అధికశాతం వ్యాక్సిన్ లు లిక్విడ్ రూపంలోనే ఉంటాయి. Also read: Invest India Conference: ఇన్వెస్ట్ ఇండియా కాన్ఫెరెన్స్..ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యాలు

కోల్డ్ స్టోరేజ్ సామర్ధ్యం ( Cold storage capacity ) పెంచాల్సిన రాష్ట్రాల్లో ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, కేరళ, తెలంగాణ, ఢిల్లీ, అస్సాం, జార్ఖండ్, పంజాబ్, ఒడిశాలున్నాయి. తాలూకా స్థాయిలో కోల్డ్ ఛైన్ సామర్ధ్యం పెంచడానికి మ్యాపింగ్ సిద్ధమైంది. వ్యాక్సిన్ ధరపై కూడా ఇప్పటికే చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. 

కోవిడ్ 19 కోసం 4-5 వందల మిలియన్ల వ్యాక్సిన్ డోసుల్ని సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు కేంద్రమంత్రి హర్షవర్ధన్ ( Central minister Harshavardhan ) తెలిపారు. 2021 జూలై నాటికి దాదాపుగా 20-25 కోట్ల మందికి వ్యాక్సినేషన్ ఇవ్వాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. వ్యాక్సిన్ పంపిణీ కోసం అక్టోబర్ 15 నాటికి పక్కా ప్రణాళిక సిద్ధం కానుంది. 

తాలూకా స్థాయిలో వ్యాక్సిన్ పంపిణీకు మార్గం సుగమం చేయడానికి స్విగ్గీ ( Swiggy ) , జొమాటో ( Zomato ) వంటి ఫుడ్ డెలివరీ సంస్థల సహాయం తీసుకోవాలనేది ప్రధాన ఆలోచనగా ఉంది. Also read: Tamil Nadu COVID-19 Deaths: ఆ మార్క్ చేరిన రెండో రాష్ట్రం తమిళనాడు

Trending News