COVID-19 positive : కాంగ్రెస్ నేతకు కరోనా పాజిటివ్

మహారాష్ట్రలో కరోనావైరస్ వ్యాప్తికి ( Coronavirus in Maharashtra ) బ్రేకులు పడటం లేదు. నిత్యం వందల సంఖ్యలో నమోదవుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ( COVID-19 positive cases ) ఆ రాష్ట్రంలోని పాలకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

Last Updated : May 23, 2020, 02:25 AM IST
COVID-19 positive : కాంగ్రెస్ నేతకు కరోనా పాజిటివ్

ముంబై: మహారాష్ట్రలో కరోనావైరస్ వ్యాప్తికి ( Coronavirus in Maharashtra ) బ్రేకులు పడటం లేదు. నిత్యం వందల సంఖ్యలో నమోదవుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ( COVID-19 positive cases ) ఆ రాష్ట్రంలోని పాలకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని కాంగ్రెస్‌ పార్టీకి అధికార ప్రతినిధిగా ఉన్న సంజయ్‌ ఝాకు ( Sanjay Jha ) కరోనావైరస్ సోకింది. తనకు కోవిడ్-19 పరీక్షల్లో పాజిటీవ్‌గా నిర్ధారణ అయ్యిందని స్వయంగా సంజయ్ ఝానే శుక్రవారం మధ్యాహ్నం ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ఇప్పటివరకు తనకు అస్సలు కరోనావైరస్ లక్షణాలు కనిపించలేదని... అయినా తనకు కరోనా పాజిటీవ్‌ అని తేలిందని సంజయ్ ట్వీట్ చేశారు. కరోనా కోరల్లోంచి బతికొచ్చిన 100 ఏళ్ల బామ్మకు ఘన స్వాగతం )

రానున్న 10-12 రోజులు తాను హోం క్వారంటైన్‌లోనే ఉండబోతున్నానని చెప్పిన సంజయ్ ఝా... కరోనావైరస్ వ్యాప్తిని తక్కువ అంచనా వేయొద్దని... మనందరికి కరోనా సోకే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. అంతేకాకుండా అందరూ కరోనా నుంచి జాగ్రత్తగా ఉండాల్సిందిగా ఆయన తన ట్వీట్ ద్వారా విజ్ఞప్తిచేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  

Trending News