కరోనా కోరల్లోంచి బతికొచ్చిన 100 ఏళ్ల బామ్మకు ఘన స్వాగతం

కరోనావైరస్ ( Coronavirus ) కోరల్లోంచి బతికొచ్చిన 100 ఏళ్ల బామ్మకు స్థానికులు ఘన స్వాగతం పలికిన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ( Indore in Madhya Pradesh ) చోటుచేసుకుంది. ఆశావాద దృక్పథంతో ధైర్యంగా పోరాడితే ఏ వయస్సు వాళ్లయినా కరోనావైరస్‌ను ఎదుర్కోవచ్చని నిరూపించిన ఘటన ఇది.

Last Updated : May 23, 2020, 01:55 AM IST
కరోనా కోరల్లోంచి బతికొచ్చిన 100 ఏళ్ల బామ్మకు ఘన స్వాగతం

ఇండోర్: కరోనావైరస్ ( Coronavirus ) కోరల్లోంచి బతికొచ్చిన 100 ఏళ్ల బామ్మకు స్థానికులు ఘన స్వాగతం పలికిన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ( Indore in Madhya Pradesh ) చోటుచేసుకుంది. ఆశావాద దృక్పథంతో ధైర్యంగా పోరాడితే ఏ వయస్సు వాళ్లయినా కరోనావైరస్‌ను ఎదుర్కోవచ్చని నిరూపించిన ఘటన ఇది. మధ్యప్రదేశ్ మొత్తంలో అత్యధిక కరోనావైరస్ పాజిటివ్ కేసులు, కరోనా మరణాలు నమోదైన పట్టణం ఇండోర్. ఇండోర్‌లో ఏ వాడకెళ్లినా... కరోనా చావు కేకలే వినిపిస్తున్న ప్రస్తుతం తరుణంలో ఇటీవల అదే పట్టణానికి చెందిన చందా బాయి అనే 100 ఏళ్ల వృద్ధురాలికి కూడా కరోనావైరస్ కూడా సోకింది. కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో కరోనా చికిత్స తీసుకున్న చందబాయి కరోనా నుంచి కోలుకుని ( 100 year-old woman recovered from COVID-19 ) పూర్తి ఆరోగ్యంగా తిరిగి ఇంటికొచ్చారు. బాలుడిని 2 కి.మీ లాక్కెళ్లిన లారీ )

చందాబాయి కరోనా నుంచి కోలుకుని గురువారం రాత్రి ఇంటికి చేరుకోగా... ఆమెను ఆస్పత్రి నుంచి తీసుకొస్తున్నారని తెలుసుకున్న కాలనీ వాసులు వారి వారి ఇళ్ల బాల్కానీల నుంచే కరతాళ ధ్వనుల మధ్య ఆమెకు ఘన స్వాగతం పలికారు. కరోనావైరస్ సోకిన వారి కుటుంబాలను అంటరాని వారిగా చూస్తున్న ఘటనలు కూడా అనేకం చోటుచేసుకుంటున్నాయి. అయితే, వాస్తవానికి మనం ద్వేషించాల్సింది కరోనావైరస్‌నే కానీ కరోనా సోకిన మనిషిని కాదని ఈ వీడియోలో కనిపిస్తున్న ఇరుగుపొరుగు నిరూపించారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  

Trending News