Sonia Gandhi: మనీలాండరింగ్‌ కేసులో ఈడీ ముందుకు సోనియా గాంధీ..భగ్గుమన్న కాంగ్రెస్‌..!

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విచారణ కొనసాగుతోంది. మనీ లాండరింగ్‌పై అధికారులు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు.

Written by - Alla Swamy | Last Updated : Jul 21, 2022, 02:14 PM IST
  • నేషనల్ హెరాల్డ్ కేసు
  • ఈడీ ముందుకు సోనియా గాంధీ
  • కాంగ్రెస్‌ శ్రేణుల ఆందోళన
Sonia Gandhi: మనీలాండరింగ్‌ కేసులో ఈడీ ముందుకు సోనియా గాంధీ..భగ్గుమన్న కాంగ్రెస్‌..!

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించి మనీ లాండరింగ్‌ కేసులో ఈడీ ముందు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ హాజరైయ్యారు. ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీతో కలిసి ఈడీ కార్యాలయాన్ని వచ్చారు. అనంతరం విచారణ గదిలోకి సోనియా గాంధీ వెళ్లారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. సోనియా గాంధీకి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో వెంట కుమార్తె ఉండేందుకు అధికారులు అనుమతించారు. 

ఇటీవల ఆమె కరోనా బారిన పడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకున్నారు. మరోవైపు ఈకేసులో సోనియాను ఈడీ విచారించడం ఇదే తొలిసారి. అదనపు డైరెక్టర్ స్థాయి మహిళా అధికారి ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. ఇటీవల ఇదే కేసులో రాహుల్ గాంధీని ఈడీ అధికారులు విచారించారు. మరోవైపు సోనియా గాంధీని ఈడీ విచారణకు పిలవడంపై కాంగ్రెస్ భగ్గుమంది.

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. రాజకీయ కక్షతోనే ఇలా చేస్తున్నారని మండిపడుతున్నారు. ఢిల్లీలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్‌లు చేస్తున్నారు. దీంతో ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద గందరగోళ వాతావరణం నెలకొంది. 

Also read:EPFO: ఈపీఎఫ్‌ఓలో పెరుగుతున్న ఖాతాదారుల సంఖ్య..మేలో ఎంత మంది చేరారంటే..!

Also read:Presidential Election Result-LIVE* Updates: కొనసాగుతున్న భారత రాష్ట్రతి ఎన్నికల కౌంటింగ్..విజయం ఎవరిదో..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News