Fairness Cream: ఢిల్లీలోని వినియోగదారుల కోర్టు ఇమామీ లిమిటెడ్‌కు రూ.15 లక్షల జరిమానా విధించింది. కంపెనీకి చెందిన ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ క్రీమ్ ప్రకటన తప్పుదారి పట్టించేదిగా ఉందని గుర్తించింది. క్రీమ్‌తో ఫెయిర్ స్కిన్ రావడం లేదని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఆ వ్యక్తి ఫెయిర్ నెస్ క్రీమ్ ను 2013లో రూ.79కి చేశాడు.అయితే సదరు వ్యక్తి క్రీమ్‌ను సరిగ్గా ఉపయోగించలేదని కంపెనీ వాదించింది.
ఇమామీ లిమిటెడ్‌పై ఢిల్లీ వినియోగదారుల కోర్టు 15 లక్షల రూపాయల జరిమానా విధించింది. కంపెనీ 'ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్' క్రీమ్ తప్పుదోవ పట్టించే ప్రకటనల కారణంగా ఈ జరిమానా విధించింది. సూచించిన విధంగా క్రీమ్ ఉపయోగించిన తర్వాత కూడా చర్మం కాంతివంతంగా లేదని ఒక వ్యక్తి ఫిర్యాదు చేశాడు. అతను ఈ క్రీమ్‌ను 2013లో రూ.79కి కొనుగోలు చేశాడు. సెంట్రల్ ఢిల్లీ డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ డిసెంబర్ 9న ఇమామీకి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది.
Also read: YCP India Alliance: ఇండియా కూటమిలో వైసీపీ, మమత నాయకత్వానికి మద్దతు
ప్యాకేజింగ్, ప్రొడక్టు లేబుల్ పై ఇచ్చిన సూచనల ప్రకారం ప్రొడక్టును క్రమం తప్పకుండా ఉపయోగించినట్లు ఫిర్యాదుదారుడు తన కంప్లెయింట్ లో పేర్కొన్నాడు. కానీ అతను అనుకున్న విధంగా ఫెయిర్ నెస్ రాలేదు.ఇతర ప్రయోజనాలు కూడా ఏం లేవని పేర్కొన్నాడు. అయితే ఫిర్యాదు చేసిన వ్యక్తి కంపెనీ సూచనలను పాటించలేదని క్రీమ్ ను ఉపయోగించినట్లుగా కూడా ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. కాబట్టి తమ ప్రొడక్టులో లోపం లేదని ఇమామి కన్య్సూమర్ కోర్టుకు వెల్లడించింది. కాగా కంపెనీ సూచనలను పాటించలేదని ఆరోపణలు చేయడంతో ఫిర్యాదుదారుని తప్పుబట్టే అవకాశం లేదని ఫోరమ్ పేర్కొంది. ఇది తప్పుదోవ పట్టించే యాడ్స్, అన్యాయమైన వాణిజ్య పద్ధతులను సూచిస్తుందని అధ్యక్షుడు ఇందర్ జిత్ సింగ్, సభ్యురాలు రష్మీ బన్సాల్ తో కూడిన ఫోరమ్ ఇమామి లిమిటెడ్ కు రూ. 15లక్షల జరిమానాను విధించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.