India corona Update: తగ్గుతున్న కొవిడ్​ ఉద్ధృతి- కొత్తగా ఎన్ని కేసులంటే..

India corona Update: దేశంలో కొవిడ్ ఉద్ధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. కొత్త కేసుల సంఖ్య భారీగా తగ్గింది. తాజాగా 30 వేల దిగువన కొత్త కేసకులు నమోదయ్యాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 15, 2022, 09:51 AM IST
  • భారీగా దిగొస్తున్న కరోనా కేసులు
  • 5 లక్షల దిగువకు చేరిన యాక్టివ్​ కేసుల సంఖ్య
  • 1.19 శాతానికి తగ్గిన మరణాల రేటు
India corona Update: తగ్గుతున్న కొవిడ్​ ఉద్ధృతి- కొత్తగా ఎన్ని కేసులంటే..

India corona Update: దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో తగ్గుతున్నాయి. తాజాగా ఒక్క రోజులో 27,409 కేసులు బయటపడ్డట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ప్రకటించింది. దేశంలో పాజిటివిటీ రేటు 2.23 శాతానికి తగ్గినట్లు వెల్లడించింది.

క్రితం రోజుతో పోలిస్తే కేసుల సంఖ్య భారీగా తగ్గింది. ఇక గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ కారణంగా 347 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది ఆరోగ్య శాఖ.

దేశంలో ఇప్పటి వరకు కరోనా కారణంగా 5,09,358 మంది కొవిడ్​కు బలయ్యారు. దీనితో మరణాల రోటు 1.19 శాతానికి దిగొచ్చింది.

యాక్టివ్​  కేసులు ఇలా..

దేశవ్యాప్తంగా ఇంకా 4,23,127 యాక్టివ్​ కరోనా కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా యాక్టివ్​ కేసుల రేటు 0.99 శాతానికి తగ్గింది.

దేశంలో రికవరీలో కూడా భారీగా పెరుగుతున్నాయి. తాజాగా 82,817 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశంలో 4,17,60,458 మంది కొవిడ్​ను జయించారు. దేశంలో రికవరీ రేటు 97.82 శాతంగా ఉంది.

వ్యాక్సినేషన్ ఇలా..

తాజాగా దేశవ్యాప్తంగా 44,68,365 డోసుల కరోనా టీకా డోసులు పంపిణీ చేశారు. వీటితో కలిపి ఇప్పటి వరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,73,42,62,440 వద్దకు చేరింది.

Also read: CISF Recruitment 2022: సీఐఎస్‌ఎఫ్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. తెలంగాణ, ఏపీలో ఖాళీలు!

Also read: Mamata Banerjee Talks to KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ కు మమతా బెనర్జీ ఫోన్.. దేశ రాజకీయాలపై చర్చ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News