భారతదేశంలో కరోనావైరస్ ( Coronavirus In India) సంక్రమణ రోజురోజుకూ పెరుగుతోంది. గత 24 గంటల్లో ఏకంగా 57,118 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 16,959,88కు చేరుకుంది. గత 24 గంటల్లో 36,569 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 10 లక్షల 94 వేల 374కు చేరుకుంది. గత 24 గంటల్లో కోవిడ్-19 ( Covid-19 ) వల్ల 764 ప్రాణాలు కోల్పోగా .. మరణించిన వారి సంఖ్య 36,511కు ( Covid-19 Deaths India ) చేరుకుంది. ప్రస్తుతం భారత దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,65,103 గా ఉంది. ( IPL 2020 UAE Facts: క్రకెటర్స్ భద్రత కోసం తీసుకోనున్న చర్యలివే )
భారత్ లో ప్రస్తుతం 64.53 శాతం రికవరీ రేటు ( Recovery Rate In India ) ఉంది. ఇక కరోనావైరస్ ( Coronavirus ) మరణాల రేటు విషయానికి వస్తే అది 2.15 శాతంగా ఉంది. ఈ విషయంలో ప్రపంచంలోని అనేక దేశాలతో పోల్చితే మనదేశం పరిస్థితి బాగుంది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ అందించిన తాజా రిపోర్టు ప్రకారం.. శుక్రవారం రోజు మొత్తం 5,25,689 కోవిడ్-19 టెస్టులు నిర్వహించారు. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య ఒక కోటి 93 లక్షల 58 వేల 659కి చేరుకుంది. ప్రస్తుతం టెస్టుల్లో చైనా, అమెరికా, రష్యా తరువాత భారత్ నాలుగవ స్థానంలో ఉంది. ( 42 Covid-19 Patient Went Missing In Uttar Pradesh Ghazipur )