Covid-19 in India: దేశంలో కొవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 17,135 మంది (Corona cases in India) వైరస్ బారిన పడ్డారు. మహమ్మారితో మరో 47 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ నుంచి 19,823 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.49 శాతంగా నమోదైంది. దేశంలో మెుత్తం కేసులు 4,40,67,144 కాగా... టోటల్ మరణాల సంఖ్య 5,26,477 గా ఉంది. ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 4,34,03,610 గా నమోదైంది. నిన్న మరో 4,64,919 మందికి కరోనా టెస్టులు చేశారు.
COVID19 | India records 17,135 new cases in the last 24 hours; Active cases at 1,37,057
— ANI (@ANI) August 3, 2022
భారత్ లో ప్రస్తుతం 1,37,057 యాక్టివ్ కేసుల ఉన్నాయి. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం స్థిరంగా కొనసాగుతోంది. నిన్న 23,49,651 మందికి వ్యాక్సిన్ వేశారు. దేశం మెుత్తం మీద ఇప్పటివరకు పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 204.84 కోట్లు దాటింది. వరల్డ్ వైడ్ గా కరోనా కల్లోలం కొనసాగుతోంది. తాజాగా కొత్తగా 8,21,908 మంది వైరస్ బారినపడ్డారు. మహమ్మారితో మరో 1,938 మంది ప్రాణాలు విడిచారు. జపాన్, దక్షిణ కొరియాలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో వెలుగు చూస్తున్నాయి. తాజాగా జపాన్ లో 167,678 కేసులు, దక్షిణ కొరియాలో 111,700 కేసులు నమోదయ్యాయి.
Also Read: PM Modi's Brother Prahlad Joshi: కేంద్రంపైనే ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్ జోషి ధర్నా
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook